ఎరవాడ సెంట్రల్ జైలులో జైలర్‌పై ఖైదీల దాడి, మణికట్టు ఫ్రాక్చర్...

Published : Feb 16, 2024, 10:40 AM IST
ఎరవాడ సెంట్రల్ జైలులో జైలర్‌పై ఖైదీల దాడి, మణికట్టు ఫ్రాక్చర్...

సారాంశం

ఖైదీలు జైలర్ మీద దాడి చేసిన ఘటన పూణెలో కలకలం రేపింది. ఈ దాడిలో జైలర్ తీవ్రంగా గాయపడ్డారు. 

పూణె : పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో కొందరు ఖైదీలు జైలర్ మీద దాడి చేశారు. ఈ దాడిలో జైలర్ గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో జైలర్ షెర్ఖాన్ పఠాన్ ముఖానికి గాయాలు అయ్యాయని, మణికట్టు విరిగిందని తెలిపారు.

"పఠాన్ జైలు సర్కిల్ I ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు, ఖైదీలు ప్రకాష్ రేనూస్, వికీ కాంబ్లే, మరో 10 మంది అతనిపై దాడి చేశారు. వీరిమీద కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు జరుగుతోంది" అన్నారాయన. 

2023 డిసెంబర్ లో కూడా ఇలాంటి ఘటనే ఎరవాడ జైలులో జరిగింది. ఆ సమయంలో జైలులో ఉన్న 27 ఏళ్ల అండర్ ట్రయల్ మీద నలుగురు ఖైదీల దాడి చేశారు.  పాత శత్రుత్వాలే ఈ దాడికి కారణం. దీంతో ఆ ఖైదీ తీవ్రగాయాలతో మరణించాడు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే