Alipur Fire News: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అలీపూర్ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Alipur Fire News: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని అలీపూర్ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 22 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
చనిపోయిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. వారి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. మృతులు ఫ్యాక్టరీలోనే కూలీలుగా చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో వారు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో పెయింట్ తయారీకి ఉపయోగించే కెమికల్ డ్రమ్ పేలింది. ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్యాక్టరీ లోపల సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో పెయింట్ ఫ్యాక్టరీ నడుస్తోంది. గురువారం సాయంత్రం ఫ్యాక్టరీ మంటలు చెలరేగాయి. రసాయనాల కారణంగా మంటలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులు కాలిపోయారు. తొలుత ముగ్గురు చనిపోయారని వార్తలు వచ్చాయి. తాజా అప్‌డేట్ ప్రకారం.. 7 మంది మరణించినట్లు వెల్లడైంది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలిపోయిన వ్యక్తులను వెలికితీశారు. కానీ, గుర్తించడం కష్టంగా మారింది. మంటల్లో కాలిపోయిన కొంతమందిని ఆస్పత్రికి తరలించారు. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు.
షహదారాలో అగ్ని ప్రమాదం
రాజధాని ఢిల్లీలోని రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. జనవరి 26న కూడా ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. జనవరి 26న సాయంత్రం ఈ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని బహుళ అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పసిపాపతో సహా నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించారని, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. షాహదారా ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు సాయంత్రం సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.