జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఏమీ అడగలేదు: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ

By Mahesh KFirst Published Oct 22, 2022, 8:17 PM IST
Highlights

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దేశం వదిలి పారిపోయే ప్రయత్నం చేసినట్టు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఆమె తప్పేమీ లేదని సుకేశ్ చంద్రశేఖర్ ఓ లేఖ విడుదల చేశారు.
 

న్యూఢిల్లీ: సుమారు 200 కోట్ల రూపాయల వసూళ్ల కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌ ఢిల్లీలో జైలులో ఉన్నారు. ఈయన ద్వారా పలువురు బాలీవుడ్ నటీమణులు ఖరీదైన గిఫ్టులు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ ప్రశ్నించింది. అసలు తనకు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలే లేవని ఆమె సమర్థించుకుంది. కానీ, అదే తరుణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో సుకేశ్ చంద్రశేఖర్ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

తాజాగా, సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సమర్థిస్తూ ఓ లేఖ బయటకు వచ్చింది. అందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు. మరో వైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ వదిలి పారిపోయే ప్రయత్నాలు చేసిందని, ఆధారాలను నాశనం చేసే ప్రయత్నాలు చేసిందని దర్యాప్తు చేస్తున్న అధికారులు పేర్కొన్నారు.

మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను చేర్చడం బాధాకరం అని సుకేశ్ చంద్రశేఖర్ చేతితో రాసిన లేఖను ఆయన న్యాయవాది ద్వారా మీడియాకు విడుదల చేశారు. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆమెకు, ఆమె కుటుంబానికి గిఫ్టులు ఇవ్వడంలో ఆమె తప్పు ఏముందని పేర్కొన్నారు. ఆమె తన నుంచి ఏమీ కోరుకోలేదని, కేవలం తాను ఆమె వెంట ఉండాలని మాత్రమే ఆశించిందని వివరించారు.

Also Read: బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆ ఆర్థిక నేరస్తుడి ఉచ్చులో ఎలా చిక్కారు? తెర వెనుక ఏం జరిగింది?

ఆమెకు వెచ్చించిన ప్రతి రూపాయి తాను స్వయంగా, చట్టబద్ధమైన విధానాల్లో ఆర్జించినదే అని ఆయన సమర్థించుకున్నారు. ఒక పెద్ద కుట్రను దాచిపెట్టడానికి తనపై ఈ అభియోగాలు మోపారని ఆయన ఆరోపణలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తామనని వివరించారు.

సుకేశ్ చంద్రశేఖర్ నేరాల గురించి తనకు ఏమీ తెలియదని చెప్పిన ఫెర్నాండెజ్ ఖరీదైన బహుమానాలను స్వీకరించారని ఈడీ అధికారులు తెలిపారు.

click me!