
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఓయో రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ఎవరైనా జంటలు, ప్రేమికులు, లేదా దంపతులు ఆ గదుల్లో దిగి.. సన్నిహితంగా మెలిగే సంఘటనలు ఉంటే వాటిని వీడియో తీసి.. ఆ వీడియోలను వారికి పంపిస్తున్నారు. ఆ వీడియోలు చూపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదొక రాకెట్‌గా ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇలాగే కపుల్స్‌కు ఓ గ్రూపు వీడియోలు పంపి బెదిరించింది. వారు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు లీక్ చేస్తామని హెచ్చరించినట్టు పోలీసులు వివరించారు. ఆ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ రాకెట్‌లో హోటల్ సిబ్బంది ప్రమేయం లేదని తెలుస్తున్నది.
ఈ మోసం ఎలా చేస్తున్నరనే దాన్ని కూడా పోలీసులు వివరించారు. ముందుగా ఈ గ్రూపు సభ్యులు ఓయో హోటల్‌లో రూములు బుక్ చేసుకుంటారు. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు జారుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ గదులను బుక్ చేసుకుంటారు. వీడియోలు తీసి అందులో రికార్డ్ అయిన వీడియోలు తీసుకుంటారు. ఆ తర్వాత వీడియోలోని వారి మొబైల్ నెంబర్లు కనుక్కుని వారికి ఈ వీడియోలు పంపిస్తారు.
Also Read: జమ్మూ కాశ్మీర్ ఐడీ చూపినందుకు రూమ్ ఇవ్వని హోటల్ సిబ్బంది.. ఢిల్లీలో ఘటన
నోయిడాలో ఇలాంటి నేరాలు చేస్తున్న మూడు గ్రూపులకు చెందిన నలుగురు విష్ణు సింగ్, అబ్దుల్ వాహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్రూపు అనేక చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసతున్నట్టు వివరించారు. అనుమతి లేని కాల్ సెంటర్లు నడపడం, నకిలీ సిమ్ కార్డులను అక్రమ కార్యాలకు అందించడం వంటివి చేస్తున్నట్టు తెలిపారు.
వీరి నుంచి ల్యాప్‌టాపులు, 21 మొబైళ్లు, 22 ఏటీఎం కార్డలుు సహా పలు వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఆపరేషన్లు చేపడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ గ్యాంగ్‌కు చెందిన ఒక సభ్యుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్టు వివరించారు.
ఈ ఘటనపై ఓయో ఇంకా స్పందించాల్సి ఉన్నది.