అన్నామలై : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం,  నెట్ వర్త్

By Rajesh KarampooriFirst Published Mar 12, 2024, 6:46 AM IST
Highlights

Annamalai Kuppusamy Biography: యుపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన పోలీసు అధికారిగా  అంచలంచెలుగా ఎదిగి.. నిజాయితీ నిబద్ధతగల అధికారిగా పేరు సంపాదించారు అన్నామలై. అలాంటి వ్యక్తి ఖాకీని వదిలి ఖద్దర్ లోకి ఎందుకు మారారనే సందేహం రాక మానదు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్న పై అధికారికి తలవంచి పనిచేయాల్సిందేనని భావించిన ఆయన ఖద్దరు దుస్తుల్లోకి మారారు అన్నామలై. ఒకప్పటి పోలీస్ సింగం.. నేటీ డైనమిక్ లీడర్ అన్నామలై బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
 

Annamalai Kuppusamy Biography: యుపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన పోలీసు అధికారి అంచలంచలిగా ఎదిగి నిజాయితీ నిబద్ధతగల అధికారిగా పేరు సంపాదించారు అన్నామలై. ఖాకీని వదిలి ఖద్దర్ లోకి ఎందుకు మారారనే సందేహం రాక మానదు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్న పై అధికారికి తలవంచి పనిచేయాల్సిందే. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు. ఒకప్పటి పోలీస్ సింగం.. నేటీ డైనమిక్ లీడర్ అన్నామలై బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..

అన్నామలై బాల్యం, విద్యాభ్యాసం

తమిళనాడులోని కరూర్ లో 1984 జులై 4వ తేదీన పరమేశ్వరి- కుప్పు స్వామి దంపతులకు జన్మించారు కే అన్నామలై .కుప్పి స్వామిది వ్యవసాయ కుటుంబం. అన్నామలై నమకల్ జిల్లాలోని కరూర్ ప్రభుత్వం పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత తమిళనాడులోని కోయంబత్తూర్ లో గల PSC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 2007లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ డిప్లొమా చేశాడు. అన్నమలై చదువుకుంటున్న రోజుల్లో డీఎస్సీ కాలేజీలోని మేనేజ్మెంట్ సర్కిల్ కి అలాగే సంవేది సొసైటీకి కార్యదర్శిగా పనిచేసేవాడు. లక్నోలో పీజీ చేస్తున్నప్పుడు అభియాన్ సమన్వయకర్తగా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ క్లబ్ లో చురుగ్గా పాల్గొనేవాడు. 

ప్రారంభ జీవితం

>> యుపిఎస్సి లో 244 ర్యాంకు సాధించారు అన్నమలై. 

>> 2011లో నాలుగు నెలల పాటు ఉత్తరాంచల్లోని ముస్సోరీలో శిక్షణ తీసుకోని సివిల్ సర్వేంట్ గా కెరీర్ ప్రారంభించారు. 

>> 2011 డిసెంబర్ నుండి 2013 సెప్టెంబర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఆఫీసర్ గా నియమితులయ్యాడు అన్నామలై. 

>> 2013 సెప్టెంబర్లు కర్ణాటకలోని కార్కల్ లో అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యి.. 2014 డిసెంబర్ వరకు విధులు నిర్వర్తించారు.

>> 2015 జనవరి నుండి 2016 ఆగస్టు వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేశాడు. 

>> 2016 ఆగస్టులో బదిలీపై చిక్ మాలూర్కి వెళ్లి అక్కడ 2018 అక్టోబర్ వరకు పని చేశారు.

>> 2018 అక్టోబర్ నుండి 2019 సెప్టెంబర్ వరకు దక్షిణ బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తించారు.

>> అన్నామలై  పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే రోజుల్లో ఆయనను కర్ణాటక పోలీస్ సింహం అని పిలిచేవారు.

>> 2019 డిసెంబర్ లో కోర్ట్ టాలెంట్ అండ్ లీడర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దానికి డైరెక్టర్ గా వ్యవహరించారు.

>> అన్నామలై 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

>> 2020 మార్చిలో వీధి లీడర్స్ ఫౌండేషన్ సంస్థను ప్రారంభించి చీఫ్ మెంటర్ గా వ్యవహరించాడు అన్నామలై. సేంద్రియ ఎరువులతో వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ఎలా చేయవచ్చునని అంశంలోని మెలకువలు ఆలోచనల పట్ల దేశవ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. అన్నామలై సతీమణి పేరు అఖిల. వారికి ఒక కుమారుడు. 

రాజకీయ జీవితం 

అన్నామలై పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కొన్ని నెలలు తన రాజకీయ ప్రయాణంలో ఏ పార్టీ బాగుంటుందో ఆలోచించినప్పుడు బిజెపి సరైనదని భావించారు. దీంతో 2020 ఆగస్టు 25వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరారు. అనతికాలంలోనే బీజీపీ అధిష్టానం ద్రుష్టిని ఆకర్షితుడయ్యాడు.  అదే సంవత్సరం తమిళనాడు అధ్యక్షుడుగా నియమితులయ్యారు. అలాగే.. 2020లో జరిగిన ఎన్నికల్లో కరూర్ జిల్లాలోని అరవకుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడుగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి డిఎంకె అభ్యర్థి ఎం ఆర్ ఎలంగో చేతిలో ఓడిపోయారు.

అవార్డులు

>> 2021లో టిప్పింగ్ బియాండ్ ఖాకీ పేరుతో తన రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు అన్నమలై . 

>> 2013 ఆగస్టులో  గౌరవప్రదమైన వైస్ ప్రెసిడెంట్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు

>> 2011 డిసెంబర్ లో టీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిగా యంగ్ అచీవర్స్ పురస్కారాన్ని అందుకున్నాడు. 


>> అన్నామలై వ్యవస్థలో కొన్ని సానుకూలమైన మార్పులను తాను కోరుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటారు. నిత్యం ఆయన తన అకౌంట్స్ వేదికగా తన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ చాలా చురుకుగా ఉంటాడు. అన్నామలైను  సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంతగానో అభిమానిస్తాడు. అన్నామలై క్రీడలు పట్ల ఎంతో ఆసక్తిగల అన్నామలైకి సేంద్రీయ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కలిగించడం మరో వ్యాపకం. 2022 జనవరిలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను వై క్యాటగిరీ నుంచి జడ్ క్యాటగిరికి పెంచారు.


 అన్నామలై కుప్పుసామి బయోడేటా 

★ పూర్తి పేరు: అన్నామలై కుప్పుసామి
పుట్టిన తేది: 04 జూన్ 1984 (వయస్సు 40)
పుట్టిన స్థలం: కరూర్
పార్టీ పేరు: భారతీయ జనతా పార్టీ
చదువు: పోస్ట్ గ్రాడ్యుయేట్
వృత్తి: మాజీ సివిల్ సర్వెంట్, రాజకీయ నాయకుడు
తండ్రి పేరు: కుప్పుసామి
తల్లి పేరు: పరమేశ్వరి
జీవిత భాగస్వామి పేరు: అకిలా ఎస్. నాథన్
మతం: హిందూ
కులం:  వెల్లాల గౌండర్
ఇమెయిల్: annamalai.kuppusamy@gmail.com
  
 

click me!