కాంగ్రెస్ లో చేరడం కంటే బావిలో దూకడం మంచిది - బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Published : Jun 17, 2023, 04:24 PM IST
కాంగ్రెస్ లో చేరడం కంటే బావిలో దూకడం మంచిది - బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

సారాంశం

కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీకి చెందిన దివంతగ నేత శ్రీకాంత్ జిచ్కర్ ఒక సారి తనను కోరారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ దానిని తాను తిరస్కరించానని తెలిపారు. ఆ పార్టీలో చేరడం కంటే బావిలో దూకి చనిపోవడం మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కంటే బావిలో దూకడమే మంచిదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, నేత నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహారాష్ట్రలోని భండారాలో సభలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తనకు కాంగ్రెస్ లో చేరాలని ఆఫర్ వచ్చిందని, కానీ ఆ పార్టీలో సభ్యుడిగా ఉండటం కంటే బావిలో దూకి చనిపోవడమే మంచిదని ఆ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పారు.

గుజరాత్ దర్గా వివాదం.. జునాగఢ్ లో ఆక్రమణల తొలగింపు వద్దంటూ పోలీసులపైకి రాళ్లు.. పౌరుడు మృతి

దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ ఒకసారి తనను పార్టీలో చేరాలని ఆహ్వానించారని నితిన్ గడ్కరీ తెలిపారు. కానీ ఆయన ప్రతిపాదనను తాను తిరస్కరించారని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన పనులతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో దేశంలో రెట్టింపు పనులు చేసిందని గడ్కరీ అన్నారు.

ఒడిశా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ ను కాల్చి చంపిన వేటగాళ్లు..

‘మీరు చాలా మంచి పార్టీ కార్యకర్త, నాయకుడు. మీరు కాంగ్రెస్ లో చేరితే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిచ్కర్ ఒకసారి నాతో అన్నారు. కానీ నేను కాంగ్రెస్ లో చేరడం కంటే బావిలో దూకడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు బీజేపీ, దాని సిద్ధాంతాలపై బలమైన నమ్మకం ఉంది. దాని కోసం పని చేస్తూనే ఉంటాను’’ అని గడ్కరీ అన్నారని వార్తా సంస్థ ‘పీటీఐ’ వెల్లడించింది. 

పాపం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై బాలిక తప్పుడు ఫిర్యాదు, చితకబాదిన స్థానికులు.. సీసీ టీవీ ఫుటేజీలో నిజం వెలుగులోకిభారత్ ను ఆర్థికంగా సూపర్ పవర్ గా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోడీ దార్శనికతను ఈ సందర్భంగా గడ్కరీ కొనియాడారు. దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చాలాసార్లు చీలిపోయిందని ఆయన గుర్తు చేశారు. ‘‘మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మనం మరచిపోకూడదు. భవిష్యత్తు కోసం గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కాంగ్రెస్ తన 60 ఏళ్ల పాలనలో 'గరీబీ హఠావో' (పేదరిక నిర్మూలన) నినాదం ఇచ్చింది. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేక విద్యా సంస్థలను కూడా తెరిచింది’’ అని ఆయన అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌