మహారాష్ట్రలో ఐటీ శాఖ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం స్వాధీనం

By team teluguFirst Published Aug 11, 2022, 1:29 PM IST
Highlights

ఇటీవల పశ్చిమ బెంగాల్ ఈడీ దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన దాడిలో భారీ మొత్తంలో డబ్బులు లభ్యం అయ్యాయి. వాటిని లెక్కించడానికి బ్యాంకు సిబ్బందికి 13 గంటల సమయం పట్టింది. 

మహారాష్ట్రలో ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు ఓ ఉక్కు, వస్త్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై ఐటీ శాఖ దాడులు జ‌రిపింది. ఈ దాడుల్లో 32 కిలోల బంగారం, రూ.58 కోట్ల లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే రూ.390 కోట్ల విలువైన అక్రమ వస్తువులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.

ఉచిత పథకాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీంతో పాటు 100 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఆ శాఖ అధికారులకు 13 గంటల సమయం పట్టింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 260 మంది పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి ఈ దాడులు కొన‌సాగించారు.

రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ మాస్క్ తప్పనిసరి నిబంధన.. ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా

ఔరంగాబాద్‌లోని ఓ బిల్డర్‌, జల్నాలోని స్టీల్‌ కంపెనీ యజమానిపై ఈ దాడులు జరిగాయి. ఆ కంపెనీ ప‌న్ను ఎగ‌వేత చేస్తుంద‌ని స‌మాచారం రావ‌డంతో గత వారం సోదాలు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జప్తు చేసిన ఆభరణాల విలువ రూ. 14 కోట్లుగా ఉంద‌ని అన్నారు. ఈ ఆపరేషన్‌లో 120కి పైగా వాహనాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.

సోదాల్లో ఫామ్‌హౌస్, బ్యాంక్ లాకర్ నుంచి రూ.58 కోట్లు లభించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఫామ్‌హౌస్ నుంచి రూ.28 కోట్లు, బ్యాంక్ లాకర్ నుంచి రూ.30 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఆ పారిశ్రామికవేత్త వ్యాపారానికి సంబంధించి శాఖ ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే, త్వరలోనే మరిన్ని వివరాలను అధికారిక ప్రకటనలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సోదాలు నిర్వ‌హించిన స‌మ‌యంలో ఆదాయ‌పు పన్ను శాఖ తీసుకున్న చర్యల గురించి కఠినమైన గోప్యతను కొనసాగించిందని కూడా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో దొరికిన నగదును స్టేట్ బ్యాంక్ ఆఫ్ జల్నాకు తరలించి లెక్కించారు. దీని కోసం 13 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 

భార్యతో గొడవపడి.. 9 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. మధ్యప్రదేశ్ లో ఘటన

కాగా.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మద్దతుదారు అంకితా ముఖర్జీకి చెందిన రెండు ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 50 కోట్లను స్వాధీనం చేసుకున్న త‌రువాత ఈ రైడ్ జ‌రిగింది. దీంతో ఇది ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా..  పశ్చిమ బెంగాల్ SSC మోసానికి సంబంధించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ఇప్పుడు ఈడీ ఆధ్వ‌ర్యంలో జ్యూడిష‌య‌ల్ క‌ష్ట‌డీలో ఉన్నారు. 
 

click me!