ఉచిత పథకాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Aug 11, 2022, 1:06 PM IST
Highlights

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలపై ప్రకటనలు చేయడంపై  సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై వాగ్దానాలు చేయడం , ఉచిత స్కీమ్ లు అమలు చేయడంపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ రకమైన పథకాల కారణంగా ఆర్ధి వ్యవస్థ నష్టపోతోందని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత వాగ్దానాలు కురిపించే రాజకీయ పార్టీలను నిషేధించాలని  బీజేపీ నేత ఆశ్వని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం నాడు విచారించింది.

ఇది సమస్య కాదని ఎవరూ అనరు. ఇది తీవ్రమైన సమస్య. తాము పన్నులు చెల్లిస్తున్నామని అభివృద్ది ప్రక్రియకు వినియోగించాలని కొందరు అనవచ్చు... కాబట్టి ఇరుపక్షాల వాదనలను కమిటీ వినాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. భారత దేశం పేదరికం ఉన్న దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించే దిశగా కేంద్రం ప్రణాళికలు కలిగిందన్నారు. 

click me!