నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్ వీ -డీ 1: డేటాను విశ్లేషిస్తున్నట్టు ఇస్రో ప్రకటన

By narsimha lodeFirst Published Aug 7, 2022, 9:41 AM IST
Highlights


శ్రీహరికోటలోని షార్ ఉపగ్రహ కేంద్రం నుండి ఎస్ఎస్ఎల్‌వీ- డీ1 రాకెట్ ను ఇవాళ ప్రయోగించారు. రెండు శాటిలైట్లను  ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. అయితే ఈ రెండు ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ రావడం లేదని ఇస్రో ప్రకటించింది. ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. 


శ్రీహరికోట: శ్రీహరికోట షార్ ఉపగ్రహ కేంద్రం నుండి SSLV-D1 రాకెట్ ను ఆదివారం నాడు ప్రయోగించారు. రెండు శాటిలైట్లతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఒకటి భూ పరిశీలన ఉప గ్రహం, మరోటి ఆజాది శాట్. చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్ వీ-డీ1. తక్కువ ఎత్తులోని సమీప భూ కక్ష్యలోకి ఉపగ్రహలను ఈ  రాకెట్ ప్రవేశ పెట్టనుంది.

మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానం కోసం ఈ ఉప గ్రహం ఉపయోగపడనుంది. ఆజాదీ శాట్ ఉపగ్రహన్ని 750 మంది విద్యార్ధులు రూపొందించారు.  ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆదివారం నాడు కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్‌వీ-డీ 1  విజయవంతంగా ప్రయోగించడంతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. 
ఎస్ఎస్ ఎల్ వీ- డీ1,  తక్కువ భూమి కక్షలో ఉపగ్రహలను ఉంచగలదు.  ఎస్ఎస్‌ఎల్ వీ 500 కిలోల బరువున్న  శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టగలదు. 34 మీటర్ల పొడవైన రాకెట్ లో ప్రధానమైన భూమి పరిశీలన కోసం ఒక ఉప గ్రహం తో పాటు విద్యార్ధులు రూపొందించిన ఆజాదీశాట్ ఉపగ్రహన్ని కూడా పర్యోగించారు. 

ఈఓఎస్-02 అనేది అధిక ప్రాదేశిక రిజల్యూషన్ తో కూడిన ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. అంతరిక్ష క్రాప్ట్ ల మైక్రోశాటిలైట్ సిరీస్ కు చెందింది ఈఓఎస్ -02.. ఆజాదీశాట్ అనేది 8 యూ క్యూబ్ శాట్, దీని బరువు 8 కిలోలు., ఇది 50 గ్రాముల బరువున్న 75 వేర్వేరు పేలోడ్ లఅను కలిగి ఉంటుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విద్యార్ధిని విద్యార్ధులు ఈ పేలోడ్ లను రూపొందించారు.

డేటా విశ్లేషిస్తున్నాం: ప్రకటించిన ఇస్రో

ఎస్ఎస్‌ఎల్ వీ-డీ1 అన్ని దశల్లో ఆవించిన విధంగానే సాగిందని ఇస్రో ప్రకటించింది. అయితే మిషన్ యొక్క టెర్మినల్ కొంత డేటా నష్టం జరుగుతున్నట్టుగా గుర్తించామని ఇస్రో ప్రకటించింది. స్థిరమైన కక్ష్యను సాధించడానికి సంబంధించి మిషన్ యొక్క తుది ఫలితాన్ని నిర్ధారించడానికి డేటాను విశ్లేషిస్తున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. మూడో దశ తర్వాత ఈఓఎస్-2, ఆజాదీ శాట్ ఉపగ్రహాలను కక్ష్యలో  ఎస్ఎస్ ఎల్ వీ-డీ 1 రాకెట్ ప్రవేశపెట్టిందని ఇస్రో ప్రకటించింది. సాంకేతిక లోపంతో ఉపగ్రహాల నుండి కంట్రోల్ సెంటర్ కు సిగ్నల్స్ అందడం లేదని ఇస్రో తెలిపింది. ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ కోసం చూస్తున్నామని ఇస్రో చైర్మెన్ ప్రకటించారు. ఆజాదీ శాట్ ఉపగ్రహం తన నిర్ణీత కక్ష్యకు పక్కకు వెళ్లినట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈఓఎస్ -02 మాత్రం నిర్ణీత కక్ష్యలోనే ఉంది. అయితే ఈ రెండు శాటిలైట్ల నుండి ఇస్రోకు ఎలాంటి సిగ్నల్ల్స్ రాకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విషయమైపరిశీలిస్తున్నారు. రాకెట్ గమనాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. 

click me!