స్వామి వివేకానందపై ‘అభ్యంతరకర’ వ్యాఖ్యలు చేసిన సాధువును బ్యాన్ చేసిన ఇస్కాన్

Published : Jul 11, 2023, 06:50 PM IST
స్వామి వివేకానందపై ‘అభ్యంతరకర’ వ్యాఖ్యలు చేసిన సాధువును బ్యాన్ చేసిన ఇస్కాన్

సారాంశం

స్వామి వివేకానంద, ఆయన గురువు రామకృష్ణ పరమహంసపై ఇస్కాన్ సాధువు అమోగ్ లీలా దాస్ ఓ కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఇస్కాన్ సదరు సాధువుపై యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.  

న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ పరమాత్ముడిని కొలిచే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఓ సాధువు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు తెలిపింది. అందుకే ఒక నెల పాటు తమ సాధువు అమోగ్ లీలా దాస్‌ను సంస్థ నుంచి నిషేధిస్తున్నట్టు వివరించింది. అమోగ్ లీలా దాస్ మోటివేషనల్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉన్నది.

అలాంటి ఓ ప్రవచనాల్లో అమోగ్ లీలా దాస్.. స్వామి వివేకానంద చేపలను తినడం గురించి కామెంట్ చేశారు. ఒక దివ్య పురుషుడు ఇతర జంతువులకు హానితలపెట్టే భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించడని ఆ వీడియోలో అమోగ్ లీలా దాస్ పేర్కొన్నారు.

‘దివ్య పురుషుడు చేపను తినవచ్చా? ఆ చేప కూడా తీవ్ర బాధకు గురవుతుంది కదా? అలాంటప్పుడు మరి ఒక దివ్య పురుషుడు చేపను తింటారా?’ అని అమోగ్ లీలా దాస్ ఎదురుగా  ఉన్న ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస పైనా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో ఇస్కాన్ ఆ సాధువుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

అమోగ్ లీలా దాస్ వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, ఆ వ్యాఖ్యలను తమను బాధించాయని ఇస్కాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు గొప్ప వ్యక్తులను, వారి బోధనలను అర్థం చేసుకోలేకపోయారని వివరించింది. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఆయనను ఒక నెల పాటు ఇస్కాన్ నుంచి నిషేధించినట్టు ఆ ప్రకటన వెల్లడించింది. 

Also Read: కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడే దమ్ముందా? మక్కెలిరగ్గొడతారు: పవన్ కళ్యాణ్ పై రోజా మండిపాటు

అమోగ్ లీలా దాస్ కూడా తన వ్యాఖ్యలకు మన్నించాలని ప్రార్థించారని ఆ ప్రకటనలో ఇస్కాన్ పేర్కొంది. ఇందుకు ప్రాయశ్చిత్తంగా తాను ఒక నెల పాటు గోవర్ధన కొండల్లోకి వెళ్లుతానని అమోగ్ లీలా దాస్ ప్రతిజ్ఞ తీసుకున్నట్టు తెలిపింది. ప్రజా జీవితం నుంచి అమోగ్ లీలా దాస్ వెంటనే ఒక నెలపాటు కనిపించకుండా పోతారని వివరించింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !