మాజీ భార్యతో ప్రస్తుత భార్యకు ఫ్రెండ్షిప్.. ఇద్దరు కలిసి భర్తను చంపేశారు!

Published : Jul 11, 2023, 04:20 PM IST
మాజీ భార్యతో ప్రస్తుత భార్యకు ఫ్రెండ్షిప్.. ఇద్దరు కలిసి భర్తను చంపేశారు!

సారాంశం

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తరుచూ గొడవలు రావడంతో ఆమె విడిగా ఉంటున్నది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఉఫాధి కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన ఇద్దరు భార్యలు ఒకరినొకరు తెలుసుకుని కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు. ఆలంగిర్ స్వగ్రామానికి వచ్చాడని తెలిసి వెళ్లి కత్తితో పొడిచి చంపేశారు.  

పాట్నా: బిహార్‌కు చెందిన ఆలంగిర్ అన్సారీ పదేళ్ల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారి మధ్య తరుచూ గొడవలు తలెత్తాయి. ఈ గొడవలతో విసిగిపోయి ఆమె భర్తతో విడిగా ఉంటున్నది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆలంగిర్ అన్సారీ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్లాడు. అనుకోకుండా ఆలంగిర్ అన్సారీ ఇద్దరు భార్యలు ఢిల్లీలో కలుసుకున్నారు. ఇద్దరూ అక్కడే కొన్నాళ్లు ఉన్నారు. ఆలంగిర్ తిరిగి బిహార్‌కు వెళ్లాడని తెలుసుకుని ఇద్దరూ కలిసి బిహార్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసే ఆలంగిర్ అన్సారీని కత్తితో పొడిచి చంపేశారు.

బిహార్‌లోని ఛాప్రాకు చెందిన ఆలంగిర్ అన్సారీ పదేళ్ల క్రితం సల్మాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరికీ తరుచూ గొడవలు జరిగేవి. దీంతో సల్మా.. ఆలంగిర్ అన్సారీతో వేరుగా  ఉంటున్నది. ఇటీవలే ఆరు నెలల క్రితం ఆలంగిర్ అన్సారీ బెంగాల్‌కు చెందిన అమీనాను పెళ్లి చేసుకున్నాడు. 

ఢిల్లీలో పని చేసేవాడు. బక్రీద్ పండుగ కోసం ఆయన తిరిగి బిహార్‌కు వచ్చాడు. ఆలంగిర్ అన్సారీ ఇద్దరు భార్యలు సల్మా, అమీనాలు ఇద్దరూ ఢిల్లీలో ఒకరినొకరు కలుసుకున్నారు. అక్కడే ఇద్దరూ కలిసి కొన్నాళ్లు ఉన్నారు. బిహార్‌కు వచ్చాడని తెలుసుకుని వారిద్దరూ జులై 9వ తేదీన ఛాప్రాకు వచ్చారు. 

వీరద్దరూ ఆలంగిర్ అన్సారీని కలిశారు. వెంటనే ఈ ముగ్గురి మధ్య వివాదం రాజుకుంది. తీవ్రంగా వాదించుకున్నారు. ఆ తర్వాత సల్మా, అన్సారీ ఇద్దరూ కలిసి ఆలంగిర్ అన్సారీపై దాడికి దిగారు. కత్తితో పొడిచి చంపేశారు.

Also Read: పేషెంట్‌తో నర్సు ఎఫైర్.. హాస్పిటల్‌లో సెక్స్ చేస్తుండగా మరణించిన పేషెంట్

ఆ తర్వాత ఆలంగిర్‌ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారు పాట్నా మెడికల్ కాలేజీకి ఆయనను తీసుకెళ్లాలని సూచించారు. ఆలంగిర్‌ను పాట్నాకు తీసుకెళ్లుతుండగానే మార్గంమధ్యలోనే ఆయన మరణించాడు. పోలీసులు ఆలంగీర్ అన్సారీ బాడీకి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. పోలీసులు ఆ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?