యూసీసీ బిల్లు మెజారిటీ వర్గాలకు వర్తించదా..? - అసదుద్దీన్ ఒవైసీ

By Sairam Indur  |  First Published Feb 7, 2024, 4:44 PM IST

ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రతిపాదించిన యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code) బిల్లుపై  ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Uniform Civil Code) ప్రశ్నలు సంధించారు. ఈ బిల్లు హిందువులు ( Hindus), గిరిజనుల ( tribal)కు మినహాయింపులు ఇస్తుందని అన్నారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలు ప్రాథమిక హక్కలను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు.


ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు రాష్ట్రంలోని మెజారిటీ వర్గాలకు ఎందుకు వర్తించదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ బిల్లు అందరికీ వర్తించే హిందూ కోడ్ తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. ఈ బిల్లు హిందువులు, గిరిజనులకు మినహాయింపులు ఇస్తుందని అన్నారు. ముస్లింలను వేరే మతం, సంస్కృతిని అనుసరించేలా బలవంతం చేస్తుందని తెలిపారు. దీని వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పారు.

ఖర్గే రాజ్యసభలో ప్రసంగం చూసి నాకు ఆశ్చర్యమేసింది - ప్రధాని నరేంద్ర మోడీ..

Latest Videos

ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ‘‘ ప్రతిపాదిత ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లులోని బిగామీ, హలాలా, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ చర్చనీయాంశంగా మారాయి. కానీ హిందూ అవిభాజ్య కుటుంబాన్ని ఎందుకు మినహాయించారని ఎవరూ అడగడం లేదు. అసలు ఇది ఎందుకు అవసరమని ఎవరూ అడగడం లేదు. వరదల వల్ల తమ రాష్ట్రానికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. 17 వేల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగి రూ.2 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఉత్తరాఖండ్ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది, కాబట్టి దీనిని తెరపైకి చేయాల్సిన అవసరం ఉందని ధామి భావిస్తున్నారు. ’’ అని పేర్కొన్నారు. 

గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని తరతరాలుగా ప్రభువుల్లా గౌరవించాలా ? - శరిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

‘‘ఇందులో ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. గిరిజనులను ఎందుకు మినహాయించారు? ఒక సామాజిక వర్గానికి మినహాయింపు ఇస్తే అది ఏకరీతిగా ఉంటుందా? తరువాత ప్రాథమిక హక్కుల సమస్య కూడా ఉంది. నా మతం, సంస్కృతిని ఆచరించే హక్కు నాకు ఉంది. ఈ బిల్లు వేరే మతం, సంస్కృతిని అనుసరించాలని నన్ను బలవంతం చేస్తుంది. మన మతంలో వారసత్వం, వివాహం మత ఆచారంలో భాగం, వేరే వ్యవస్థను అనుసరించాలని బలవంతం చేయడం ఆర్టికల్ 25, 29 ఉల్లంఘన అవుతుంది’’ అని తెలిపారు. 

మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ

‘‘యూసీసీ రాజ్యాంగపరమైన అంశం ఉంది. యూసీసీ పార్లమెంటు మాత్రమే చట్టబద్ధం చేయగలదని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ఈ బిల్లు షరియా చట్టం, హిందూ వివాహ చట్టం, ఎస్ఎంఏ, ఐఎస్ఏ వంటి కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉంది. రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఈ చట్టం ఎలా పనిచేస్తుంది? ’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే ఎస్ఎంఏ, ఐఎస్ఏ, జేజేఏ, డీవీఏ తదితర రూపాల్లో స్వచ్ఛంద యూసీసీ ఉంది. అంబేడ్కర్ స్వయంగా దీన్ని తప్పనిసరి చేయనప్పుడు ఎందుకు తప్పనిసరి చేశారు?’’ అని ఒవైసీ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతాననడం అహంకారమే - బండి సంజయ్.. 

కాగా.. లోక్ సభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లు బీజేపీ సైద్ధాంతిక ఎజెండాలో ఒక ముఖ్యమైన అంశం. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వారసత్వంపై ఉమ్మడి చట్టం కల్పించడమే దీని ఉద్దేశం. అయితే దీనిని గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు అధ్యయనం చేసి అమలు చేసే అవకాశం ఉంది.

click me!