Rahul Gandhi: రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి అవుట్? సీటుపై సీపీఐ ఆసక్తి!

By Mahesh KFirst Published Feb 7, 2024, 4:28 PM IST
Highlights

రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి పోటీలో ఉండరా? వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? ఆ సీటు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగుతారా? అంటే కొన్ని వర్గాలు ఔననే చెబుతున్నాయి. ఎల్డీఎఫ్ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై సీపీఐకి వయానాడ్ సహా నాలుగు పార్లమెంటు స్థానాలు దక్కాయి. కానీ, ప్రస్తుతం వయానాడ్‌కు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

Wayanad: యూపీలోని కాంగ్రెస్ కంచుకోట అమేథీతోపాటు దక్షిణాది కేరళలోని వయానాడ్ పార్లమెంటు స్థానం నుంచీ రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2019లో అమేథీ నుంచి ఓడిపోయారు. కానీ, వయానాడ్ నుంచి గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో ఇంకా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడలేదు. యూపీలో కాంగ్రెస్ హవాకు ప్రియాంక గాంధీ గతంలో కృషి చేసినా ఆశించిన ఫలితాలు రాలేవు. దీంతో ఈ సారి కూడా రాహుల్ గాంధీ సౌత్ నుంచే పార్లమెంటుకు వెళ్లే అవకాశాలను రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, తాజాగా, అందుతున్న సంకేతాల ప్రకారం రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి కూడా పోటీ చేయడం డౌటేనా? అనే అనుమానాలకు తెరలేపుతున్నాయి.

కేరళలో అధికారంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్నది. ఇందులో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం ఉన్నాయి. కాగా, యూడీఎఫ్ అంటే కేరళలో ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎల్‌డీఎఫ్ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై కేరళలోని వయానాడ్ సహా నాలుగు పార్లమెంటు స్థానాలను సీపీఐకి అప్పగించారు. కానీ, జాతీయ స్థాయిలో చూస్తే ఇండియా కూటమిలో ఈ మూడు పార్టీలూ భాగస్వామ్య పార్టీలే. దీంతో అసలు చిక్కు వచ్చింది. సీపీఐకి వయానాడ్ సీటు కేటాయించినా.. ఇండియా కూటమి ప్రకారం వయానాడ్ సీటుపై కాంగ్రెస్‌కూ హక్కు ఉంటుంది.

Latest Videos

Also Read: Lok Sabha Elections: ఇండియా కూటమి పార్టీకి బీజేపీ గాలం.. ఆర్ఎల్డీకి 7 సీట్లు ఆఫర్!

దీనికి సంబంధించి కొంత గందరగోళం ఉన్నది.  ప్రస్తుతం వయానాడ్ స్థానాన్ని కాంగ్రెస్ కలిగి ఉన్నది. అయితే, ఈ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి కోరడంపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. భవిష్యత్‌లో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఒక వేళ రాహుల్ గాంధీ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆ స్థానం నుంచి సీపీఐ జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి, డీ రాజా భార్య అనీ రాజాను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.  సీట్ల సర్దుబాటు కోసం ఇప్పటికే త్రిసభ్య  కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ రాష్ట్ర శాఖతో ఈ కమిటీ చర్చలు జరపనుంది.

click me!