సుశాంత్ ఆత్మహత్య కేసు: క్వారంటైన్ కు బలవంతంగా ఐపిఎస్ అధికారి

Published : Aug 03, 2020, 08:10 AM IST
సుశాంత్ ఆత్మహత్య కేసు: క్వారంటైన్ కు బలవంతంగా ఐపిఎస్ అధికారి

సారాంశం

సుశాంత్ హత్య కేసును విచారిస్తున్న ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని ముంబై అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేశారని బీహార్ డీజీపీ ఆరోపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమరంగా మారింది. సుశాంత్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేశారని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ముంబై నగరపాలక సంస్థ అధికారులు బలవంతంగా ఆయనను క్వారంటైన్ కు పంపించారని బీహార్ డీజీపీ ఆదివారంనాడు ఆరోపించారు. 

సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారణకు బీహార్ పోలీసు బృందం ముంబై వెళ్లింది. ఐపిఎస్ అధికారి వినయ్ తివారీ ముంబై వెళ్లాడని, సుశాంత్ ఆత్మహత్య కేసును విచారించడానికి తివారీ తన జట్టుతో ముంబై వెళ్లాడని, అయితే బొంబాయి నగర పాలక సంస్థ అధికారులు తివారీని రాత్రి 11 గంటలకు క్వారంటైన్ కు పంపించారని ఆయన వివరించారు. 

 

తాము విజ్ఢప్తి చేసినప్పటికీ ఐపిఎస్ మెస్ లో తివారీకి వసతి కల్పించలేదని, గోరేగావ్ అతిథి గృహంలో ఉంటున్నారని పాండే చెప్పారు. రియా చక్రవర్తి పేరును ప్రస్తావిస్తూ తన కుమారుడి ఆత్మహత్యపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు ేచశారు తివారీ నేతృత్వంలో పాట్నా పోలీసులు సుశాంత్ ఆత్మహత్యపై విచారణ చేయడానికి సిద్ధపడ్డారు. 

సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది వాంగ్మూలాలు సేకరించారు. సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేశారు .

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: గుడిని వదలరు..గుడిలో లింగాన్ని వదలరు..మరీ ఇంత కక్కుర్తా..? ట్రైన్‍లో ఇవి కూడా వదలరా?