మేన కోడలిపై కన్నేసి.. రహస్యంగా వీడియోలు తీసి..

Published : Aug 03, 2020, 08:09 AM IST
మేన కోడలిపై కన్నేసి.. రహస్యంగా వీడియోలు తీసి..

సారాంశం

ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు.  

సొంత మేనకోడలిపై కన్నేశాడు. ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పాడు. అనంతరం ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి తర్వాత  కూడా.. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెను బలవంత పెట్టడం మొదలుపెట్టాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరల్‌లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి  సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు.

ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..