కాంగ్రెస్ నేత ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లోకి అశ్లీల చిత్రాలు

Published : Aug 03, 2020, 07:33 AM ISTUpdated : Aug 03, 2020, 07:40 AM IST
కాంగ్రెస్ నేత ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లోకి అశ్లీల చిత్రాలు

సారాంశం

గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. ఇదేం బాగాలేదని గ్రూప్‌లోని కొందరు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దీనికి పాటిల్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఓ కాంగ్రెస్ నేత ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లోకి అశ్లీల చిత్రాలు అప్ లోడ్ అయ్యాయి. అవి కాస్త వెంటనే వైరల్ గా మారాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మాజీ కాంగ్రెస్‌ జిల్లాధ్యక్షుడు రవిగౌడ పాటిల్‌ దూళఖేడ మొబైల్‌ఫోన్‌ నుంచి కొన్ని అశ్లీల ఫోటోలు వాట్సప్‌ గ్రూప్‌లోకి వెళ్లడం వైరల్‌గా మారింది. అతని ఫోన్‌ నుంచి కొన్ని నీలిచిత్రాలు విజయపుర డీసీసీ ప్రెస్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. ఇదేం బాగాలేదని గ్రూప్‌లోని కొందరు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దీనికి పాటిల్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

దీనిని గమనించిన గ్రూప్‌ అడ్మిన్, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వసంతహొనమాడే, రవిగౌడ పాటిల్‌ను గ్రూప్‌ నుంచి తొలగించారు. ఆదివారం ఉదయం రవిగౌడ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణ కోరారు. తన ఇంట్లోని చిన్నపిల్లలు మొబైల్‌ తీసుకుని ఆడుకున్నారని ఆ  సమయంలో ఫోటోలు వెళ్లి ఉండవచ్చని.. అందరూ తనని క్షమించాలని పాటిల్‌ సంజాయిషి ఇచ్చారు. చిన్నపిల్లలు అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తారంటే నమ్మశక్యంగా లేదని మరికొందరు పేర్కొనడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu