అంతర్జాతీయ విమాన సర్వీసుల (International Flights)పై ఉన్న నిషేధాన్ని డీజీసీఏ మరోమారు పొడిగించింది . 2022 జనవరి 31 వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ దేశాలను వణికించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోన్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
International Flights: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా విజృంభన తగ్గుముఖం పడుతోంది అనుకునే తరుణంలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చి.. భయాందోళనలకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగులోకి ఈ వేరియంట్ చాపకింద నీరులా ప్రవహిస్తూ.. ప్రపంచ వ్యాప్తం అవుతుంది. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 57 దేశాలను విస్తరించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది డబ్యూహెచ్ ఓ. ఈ వేరియంట్ లో డేంజరస్ మ్యుటేషన్స్ ఉందనీ, తన గమానాన్ని మర్చుకోగలదని హెచ్చరింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
ఈ క్రమంలోనే భారత్ లో కూడా ఓమిక్రాన్ వేరియంట్ ప్రవేశించడంతో భయాందోళనలు ప్రారంభమయ్యయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నా అత్యధికంగా వ్యాప్తి చెందే ప్రమాదమున్నదనీ, అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది డబ్యూహెచ్ ఓ. ఈ నేపథ్యంలో విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల విషయంలో ఆందోళన నెలకొనగా ఈ మేరకు రెగ్యులేటర్ గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.
Read Also: https://telugu.asianetnews.com/international/omicron-four-times-more-transmissible-than-delta-in-new-study-r3uhh0
సర్క్యులర్ ద్వారా DGCA సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ కు వచ్చే మరియు భారత్ నుంచి వెళ్లే.. అంతర్జాతీయ విమాన సేవలను 2022 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు మరియు ప్రత్యేకంగా ఆమోదించిన విమానాలకు ఈ పరిమితి వర్తించదని DGCA తెలిపింది. .
undefined
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే తరుణంలో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో ఓమిక్రాన్ విజృంభించడం. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేయడంతో డీజీసీఐ పునరాలోచనలో పడింది. డిసెంబర్ 1 నుంచి 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దని నిర్ణయించింది. తాజాగా దీనిని వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
తొలుత.. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యాలో పెట్టుకుని మార్చి 23, 2020 నుండి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. అయితే.. ఈ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు. దీంతో మే 2020 నుండి జూలై 2020 వరకూ ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడిపాయి. ఆ తర్వాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి.
ఆ తరువాత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం, ఈ క్రమంలో వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన డీజీసిఏ కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని వెల్లడించింది.
ఇక అంతర్జాతీయ కార్గో సేవలకు ఈ నిర్ణయం వర్తించదని, అంతర్జాతీయ కార్గో సేవలు కొనసాగుతాయని డీజే పేర్కొంది. కేస్ టు కేస్ బేసిస్ లో ఇప్పటికే షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమానాలు ఎంపిక చేసిన రూట్లలో కొనసాగుతాయని వెల్లడించింది.