
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఆ దేశ ప్రజలు ఒక్క సారిగా కోపోద్రిక్తులయ్యారు. రాజధాని కొలొంబో నగరానికి చేరుకొని నిరసనలు చేపట్టారు. అవి హింసాత్మకంగా మారాయి. అధ్యక్ష భవనంలోకి చొరబడి అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను పారిపోయేలా చేశారు. దీంతో ఆయన జూలై 13వ తేదీన రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆదివారం శ్రీలంకకు సంఘీభావం తెలిపారు.పొరుగు దేశంలో పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ఆమె నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.
వీఐపీ కల్చర్ అంతం చేస్తానని, కార్ల కోసమే రూ.1.44 కోట్లు.. ‘‘సామాన్య’’ ముఖ్యమంత్రిపై విమర్శలు
శ్రీలంకలో పరిణామం చెందుతున్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ ఆందోళనతో ఉందని అందులో పేర్కొన్నారు. ‘‘ ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ధరలు, ఆహారం, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత అక్కడి ప్రజలలో అపారమైన కష్టాలు, బాధలను కలిగించాయి ’’ అని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన సంక్షోభం ఉన్న ఈ తరుణంలో శ్రీలంక, దాని ప్రజలకు కాంగ్రెస్ తన సంఘీభావాన్ని తెలియజేస్తోందని, ఈ పరిస్థితులను దేశం అధిగమించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ఇబ్బందులను ఎదుర్కొనేందుకు శ్రీలంక ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం సహాయం కొనసాగిస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీలంకకు అన్ని సహాయాలు, మద్దతును అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది అని తెలిపారు.
కాగా నేటి తెల్లవారుజామున శ్రీలంక విషయంలో జై శంకర్ మాట్లాడారు. శ్రీలంకకు సహాయం చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని, ఇంకా శరణార్థుల సంక్షోభం లేదని చెప్పారు. ‘‘మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాం, సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాం. ఏమి జరుగుతుందో మేము వేచి చూస్తున్నాం. ప్రస్తుతం అయితే దేశానికి శరణార్థుల సంక్షోభం లేదు ’’ అని అన్నారు.
గోవా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు.. పార్టీ భేటీకి దూరంగా ముగ్గురు ఎమ్మెల్యేలు.. బీజేపీతో టచ్‌లో కొందరు!
ప్రతిపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సంక్షోభం ప్రారంభమైనప్పటి నిరసనకారుల డిమాండ్ ఇదే. కానీ గోటబయ తన పదవికి అతుక్కుపోయారు. అయితే ఈ ఇబ్బందుల్లో మహీంద్ర రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఎంపీ హర్ష డి సిల్వా స్పందించారు. ‘‘ ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి మెజారిటీ పార్టీల నాయకులు కొన్ని అంశాలపై అంగీకరించారు. అందులో త్వరలో ఎన్నికల నిర్వహణ, అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షుడు పదవిలో ఉంటారు. రాబోయే కొద్ది రోజుల్లో అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని నియమించనున్నారు ’’ అని ఆయన ట్వీట్ చేశారు.