వీఐపీ కల్చర్ అంతం చేస్తానని, కార్ల కోసమే రూ.1.44 కోట్లు.. ‘‘సామాన్య’’ ముఖ్యమంత్రిపై విమర్శలు

Siva Kodati |  
Published : Jul 10, 2022, 03:56 PM ISTUpdated : Jul 10, 2022, 03:59 PM IST
వీఐపీ కల్చర్ అంతం చేస్తానని, కార్ల కోసమే రూ.1.44 కోట్లు.. ‘‘సామాన్య’’ ముఖ్యమంత్రిపై విమర్శలు

సారాంశం

సామాన్యుల ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కారుల కోసం దాదారు రూ.1.44 కోట్లు ఖర్చు చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి

అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) .. ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతున్న పేరు. మూసలో కొట్టుకుపోతున్న భారతదేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరుబాటపట్టారు. అన్నాహజారేతో కలిసి పోరాటాలు చేసి ఆయన  రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన ఆయన దేశం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపించి ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడు పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రంలోనూ పార్టీని (aap) అధికారంలోకి తెచ్చారు. 

ఇలా అతికొద్దికాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) జాతీయ పార్టీలకు సవాల్ విసిరే స్థాయికి చేరుకున్న ప్రస్థానం నిజంగా అద్భుతమే. సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా డబ్బుకు దూరంగా రాజకీయాలు చేస్తోన్న ఆప్.. స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. చైతన్యవంతమైన సమాజం అవినీతి రహిత సమాజం, అభివృద్ధి దిశగా పాలన సాగిస్తోంది. పంజాబ్ లో ఆప్ ఘన విజయంతో నాన్ కాంగ్రెస్ , నాన్ బీజేపీలకు కేజ్రీవాల్ దిక్సూచీగా మారారు. 

ALso Read:CM Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి.. అలా మార్చుతారేమో.. కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇక వీవీఐపీ కల్చర్ కు దూరంగా తన భద్రత కోసం పెద్దగా ఖర్చు పెట్టరని, తన సొంత కారునే వినియోగిస్తారని అరవింద్ కేజ్రీవాల్ కు పేరుంది. సీఎం వంటి అత్యున్నత స్థానంలో వుండి కూడా చాలా సింపుల్ గా వుండేందుకే కేజ్రీవాల్ ప్రయత్నిస్తారు. అయితే అలాంటి వ్యక్తి కోసం వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.1.44 కోట్లు ఖర్చు చేసిందని విషయం వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్ల కోసం రూ.45 లక్షలు ఖర్చు చేశారట. ఆర్టీఐ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కేజ్రీవాల్ ఈ ఏడాది రూ.36 లక్షలు విలువ చేసే ఎంజీ గ్లోస్టర్ కారును, అంతకు ముందు రెండు ఇన్నోవాలను ఉపయోగించారు. వీటితో రూ.32 లక్షల విలువైన మద్రా ఆల్టురాస్ జీ 4లో సీఎం ప్రయాణించేవారు. వీటన్నింటికి కలిపి ఢిల్లీ ప్రభుత్వం రూ. కోటిన్నర ఖర్చు పెట్టినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది. ఈ గణాంకాల నేపథ్యంలో ‘సామాన్య ముఖ్యమంత్రి’పై కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !