Rajasthan Bride: ఈ వధువు చేసిన పనికి ఎవరైనా సలాం చేయాల్సిందే..!

Published : Nov 26, 2021, 09:47 AM ISTUpdated : Nov 26, 2021, 09:48 AM IST
Rajasthan Bride: ఈ వధువు చేసిన పనికి ఎవరైనా సలాం చేయాల్సిందే..!

సారాంశం

తన తండ్రి  తన కోసం దాచిన డబ్బుని.. కట్నంగా తీసుకోవడం ఇష్టం లేక.. ఆ డబ్బుని.. బాలికలకు హాస్టల్ నిర్మించమని అడగడం విశేషం. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మన దేశంలో.. చాలా మంది పేరెంట్స్.. కూతురు పుట్టింది అంటే చాలు.. వెంటనే ఆమె పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెడతారు. చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికైనా ఆలోచిస్తారు కానీ.. పెళ్లి కోసం మాత్రం.. చిన్నప్పటి నుంచి కూడపెట్టడం మొదలుపెడతారు. కట్నం అంత ఇవ్వాలి.. ఇంత ఇవ్వాలి అని లెక్కలు పెడుతూ ఉంటారు. గ్రాండ్ గా పెళ్లి చేస్తారు.

 అయితే..  ఈ మధ్యకాలంలో కొందరికి ఈ విషయంపై అవగాహన పెరుగుతుండటంతో.. పెళ్లికి పెద్దగా ఖర్చు చేయకుండా సింపుల్ గా చేసుకుంటున్నారు. అయితే.. వారిని మించి ఓ వధువు ఉన్నతంగా ఆలోచించింది. తన తండ్రి  తన కోసం దాచిన డబ్బుని.. కట్నంగా తీసుకోవడం ఇష్టం లేక.. ఆ డబ్బుని.. బాలికలకు హాస్టల్ నిర్మించమని అడగడం విశేషం. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: యూపీలో మరో నిర్భయ ఘటన: ఎస్సై పరీక్ష రాసివస్తుండగా... కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం

రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. 

Also Read: Mizoram Earthquake: మిజోరాంలో భూకంపం, కోల్ కతాలో సైతం ప్రకంపనలు

ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్