ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. 2032 నాటికి టీఈడీబీఎఫ్ విమానాల ఉత్పత్తి : నేవీ చీఫ్

Published : Feb 16, 2023, 08:30 AM IST
ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. 2032 నాటికి టీఈడీబీఎఫ్ విమానాల ఉత్పత్తి : నేవీ చీఫ్

సారాంశం

2023 చివరి నాటికి ఐఎన్ఎస్ విక్రాంత్ అందుబాటులోకి వస్తుందని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల ఎల్ సీఏ (నేవీ), ఎంఐజీ--29కే విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ లో విజయవంతంగా దిగి, టేకాఫ్ అయ్యాయని చెప్పారు.   

దేశీయంగా  అభివృద్ధి చేసిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ఏడాది చివరి నాటికి భారత జలాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అన్నారు. ఏరో ఇండియా - 2023 సందర్భంగా బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నౌక నిర్ణీత వ్యవధిలో సముద్రంలో ఉందని, అధికారులు దాని పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్..

ఇటీవల ఎల్ సీఏ (నేవీ), ఎంఐజీ--29కే విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ లో విజయవంతంగా దిగి, టేకాఫ్ అయ్యాయని నేవీ చీఫ్ తెలిపారు. చేతక్, సీ కింగ్ హెలికాప్టర్లతో ఏవియేషన్ ట్రయల్స్ ప్రారంభించామని అన్నారు. టచ్ అండ్ గో పాటు వివిధ విన్యాసాల ద్వారా పరికరాలను క్రమాంకనం చేశామని, అవి విజయవంతమయ్యాయని తెలిపారు. పలు విమానాల ట్రయల్స్ రెండు నెలల పాటు కొనసాగుతాయని ధృవీకరించిన నేవీ చీఫ్, వేర్వేరు క్యారేజీ పరిస్థితుల్లో ట్రయల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ లోని ఏవియేషన్ ఫెసిలిటీ కాంప్లెక్స్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత, క్షిపణులతో పాటు ఆయుధ వేదికలను ఏకీకృతం చేయడం తదుపరి ప్రక్రియ. అందుకోసం నౌకను తిరిగి డ్రై డాక్ కు తీసుకురావాల్సి ఉంటుంది. 

విషాదం.. అగ్గిపెట్టెతో ఆట.. ప్రమాదవశాత్తు నిప్పంటించుకుని బాలుడు మృతి..

ఎంఎఫ్-స్టార్ (మల్టీ ఫంక్షనల్ డిజిటల్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అరే రాడార్) ఫిట్మెంట్ మే నుంచి ప్రారంభమవుతుందని, దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని నేవీ చీఫ్ ఆర్ హరి కుమార్ తెలిపారు. ఈ సమయంలో ఆమె విక్రాంత్ కొన్ని గ్యారెంటీ రీఫిట్ యాక్టివిటీకి కూడా లోనవుతుందని అన్నారు. ఆ తర్వాత రుతుపవనాలు ముగియగానే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఈ నౌకలో ఎల్ఆర్ఎస్ఏఎంలు (లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ) ఉంటాయని అన్నారు. 

2040 నాటికి అందుబాటులోకి 45 యుద్ధ విమానాలు 
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2026 నాటికి ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టీఈబీడీఎఫ్) నమూనాను అభివృద్ధి చేయడంపై పూర్తి నమ్మకంతో ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అన్నారు. 2031-32 నాటికి ఉత్పత్తిని ప్రారంభమవుతుందని, 2040 నాటికి 45 (టీఈడీబీఎఫ్) విమానాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

'ఇది వ్యక్తిగత జీవితాల్లో విధ్వంసం' బాల్య వివాహాలపై గౌహతి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

గత ఏడాది సెప్టెంబరులో నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్ మధ్యంతర ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ సంతతికి చెందిన రాఫెల్ (మెరైన్) లేదా అమెరికా బోయింగ్ తయారీ ఎఫ్ -18 సూపర్ హార్నెట్ విమానాలను నడపనుంది. రష్యాకు చెందిన మిగ్-29కే తన సర్వీసును పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అవసరం ఏర్పడింది. అందుకే మల్టీ రోల్ క్యారియర్ ఆధారిత విమానాల కొనుగోలును పరిశీలిస్తున్నామని నేవీ చీఫ్ తెలిపారు. అయితే మిగ్ -29కే ను దశలవారీగా తొలగించి, టెడ్ బిఎఫ్ ను సర్వీసులో చేర్చిన తర్వాత తలెత్తే అంతరాన్ని పూడ్చడానికి భారత నావికాదళం విమాన వాహక నౌక కోసం 26 సముద్ర యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం