
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ మహాదేవ్ ఆలయంలో గురువారంనాడు జరిగిన ప్రమాదంలో 11 మంది భక్తులు మృతి చెందారు.ఈ ప్రమాదం నుండి 19 మందిని రక్షించారు. పాడుబడిన బావిపై వేసిన స్లాబ్ ఒక్కసారిగా కూలడంతో భక్తులు బావలో పడిపోయారు. ఈ మెట్ల బావిలో పడిపోయిన మరో 11 మంది కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీరామనవమిని పురస్కరించుకని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. పాడుపడ్డ మెట్లబావిపై వేసిన స్లాబ్ పై భక్తులు నిలబడ్డారు. స్లాబ్ కుప్పకూలడంతో బావిలో సుమారు 25 మంది భక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 19 మందిని రక్షించారు.
also read:శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలోని మెట్ల బావిలో పడిపోయిన 25 మంది భక్తులు..
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎంఓ ఇండోర్ జిల్లా యంత్రాంగంతో టచ్ లో ఉంది. సంఘటన స్థలంలో ఇండోర్ పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.