100% నేను సీఎం యాస్పిరెంట్‌ను.. డీకే శివకుమార్‌తో సమస్య లేదు: సిద్దారామయ్య

Published : Mar 30, 2023, 04:53 PM IST
100% నేను సీఎం యాస్పిరెంట్‌ను.. డీకే శివకుమార్‌తో సమస్య లేదు: సిద్దారామయ్య

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ ఎవరనే చర్చ మొదలైంది. సిద్దారామయ్య, డీకే శివకుమార్‌లు ఈ పోటీలో ఉన్నారు. సీఎం క్యాండిడేట్ గురించి ఈ సందర్భంగా సిద్దారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.  

బెంగళూరు: వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్దారామయ్య గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాను వంద శాతం సీఎం ఆశావాహుడినని తెలిపారు. కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థుల పోటీలో సిద్దారామయ్యతోపాటు డీకే శివకుమార్, జీ పరమేశ్వరలు ఉన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.

‘వంద శాతం నేను సీఎం ఆశావాహుడిని. ఇప్పటి వరకు సీఎం ఆశావహుల్లో నేను, డీకే శివకుమార్ ఉన్నారు. జీ పరమేశ్వర గురించి నాకు తెలియదు. అయితే, గతంలో ఆయన కూడా సీఎం పదవి గురించి మాట్లాడారు. అలాంటి ఆశలు ఉండటంలో తప్పే లేదు’ అని సిద్దారామయ్య అన్నారు.

సీఎం క్యాండిడేట్ రేసులో ఉన్న డీకే శివకుమార్ గురించి, ఆయనతో రిలేషన్‌షిప్ గురించి ప్రస్తావించగా.. ‘కాంగ్రెస్ మొత్తం ఐక్యంగా ఉన్నది. ఆయన కూడా ఒక ఆశావాహి. అందులో తప్పేమీ లేదు. చివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు కదా’ అని అన్నారు.

Also Read: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావాలి : చంద్రబాబు నాయుడు

కాంగ్రెస్ ఎప్పుడూ ముందుగా సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించలేదని అన్నారు. ఆ నిర్ణయాన్ని ఎన్నికైన ఎమ్మెల్యేలకు, హైకమాండ్‌కే వదిలిపెడతామని వివరించారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం