రన్ వే నుంచి జారిన విమానం, బురదలో కూరుకుపోయిన చక్రం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Published : Jul 29, 2022, 12:46 PM IST
రన్ వే నుంచి జారిన విమానం, బురదలో కూరుకుపోయిన చక్రం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..

సారాంశం

గురువారం అస్సాంలోని జోర్హాట్ నుండి కోల్‌కతాకు ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే నుండి జారిపోయింది. దీంతో విమాన చక్రాలు బురద అవుట్‌ఫీల్డ్‌లో చిక్కుకుపోయాయి. విమానం రద్దయ్యింది.

గౌహతి : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్ వే నుంచి జారి.. విమానం టైరు బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని  జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్కతా వెళ్లేందుకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా రన్వేపై నుంచి జారి పడింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఆతర్వాత ప్రయాణికులందరినీ క్షేమంగా కిందికి దించారు. 

అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో  తొంభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల కొంత కాలంగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా spicejet, ఇండిగో  విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయట పడుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. 

పక్కా స్కెచ్ తో యజమాని ఇంట్లో రూ. 8 కోట్లు చోరీ చేసిన పనిమనిషి..

ఈ నేపథ్యంలో డీసీజీఏ చర్యలు చేపట్టింది. బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే  విమానాలు బయటకు రావాలని నిబంధనలు తప్పనిసరి చేసింది. B1/B2  లైసెన్స్ ఉన్న నిపుణులైన ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ నుంచి సరైన అనుమతి వచ్చిన తర్వాతే  బేస్,  ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనలు తప్పనిసరి చేస్తున్నట్లు డీసీజీఏ వెల్లడించింది. ఎనిమిది వారాల పాటు స్పైస్ జెట్ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని ఆంక్షలు విధించింది. 

గురువారం "జోర్హాట్ నుండి కోల్‌కతాకు నడుపుతున్న ఇండిగో విమానం 6E-757 తిరిగి బేకి తిరిగి వచ్చింది. టాక్సీలో వెళుతున్నప్పుడు, టాక్సీవేకి ఆనుకుని ఉన్న గడ్డిలో విమాన ప్రధాన చక్రం ఒకటి,  పాక్షికంగా కూరుకుపోయిందని తెలిసింది’ అని ఇండిగో తెలిపింది. స్థానిక జర్నలిస్ట్ ట్విటర్‌లో ఒక విమానాన్ని చూపించే చిత్రాన్ని అప్‌లోడ్ చేశాడు, అది రన్‌వే నుండి జారిపోయింది. దాని ఒక జత చక్రాలు మృదువైన గడ్డిలో చిక్కుకున్నాయి.

ఇండిగోను ట్యాగ్ చేస్తూ, అతను ఇలా రాసుకొచ్చాడు : "గౌహతి కోల్‌కతా @ఇండిగో ఫ్లైట్ 6F 757 (6E757) అస్సాంలోని జోర్హాట్ విమానాశ్రయంలో రన్‌వే నుండి జారిపోయి బురదలో చిక్కుకుంది. విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది, అయితే ఈ సంఘటన తర్వాత విమానం ఆలస్యం అయింది." అతని పోస్ట్‌కి IndiGo ప్రత్యుత్తరం ఇస్తూ, ఇలా చెప్పింది: "సర్, మేము దీనిని విని ఆందోళన చెందుతున్నాము, సంబంధిత బృందంతో ఈ విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం.   దయచేసి DM ద్వారా PNRని భాగస్వామ్యం చేయండి. మీరు క్షేమంగా,  సౌకర్యవంతంగా మీ గమ్యస్థానానికి చేరుకున్నారని ఆకాంక్షిస్తున్నాం’ అన్నారు. విమానంలో కొంత సాంకేతిక సమస్య ఉందని, రాత్రి 8:15 గంటలకు విమానాన్ని రద్దు చేసినట్లు AAI అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?