
నాగపూర్ : technical snag కారణంగా లక్నో వెళ్లవలసిన IndiGo flight నాగపూర్ విమానాశ్రమంలో emergency landing చేయాల్సి వచ్చింది. విమానం నుంచి పొగలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. 6ఈ-7074 నెంబర్ గల ఇండిగో విమానం నాగపూర్ నుంచి లక్నోకి వెళ్ళాల్సి ఉండగా.. నాగపూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ‘ఇండిగో నాగపూర్ లక్నో విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా తిరిగి నాగపూర్ విమానాశ్రయానికి వచ్చింది. పైలెట్లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి నాగపూర్ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు’ అని ఎయిర్ లైన్స్ తెలిపింది.
భారత వైమానిక దళం దేశ వ్యాప్తంగా 28 రహదారులపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలను గుర్తించిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి nitin gadkari గతవారం రాజ్యసభలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో రోడ్లపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా, మార్చి 31న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇండిగో వెబ్ సైట్ ను హ్యాక్ చేశాడు. పాట్నా నుంచి Bengaluru వచ్చిన IndiGo విమానంలో ఇద్దరు ప్రయాణికుల luggage బ్యాగులు తారుమారయ్యాయి. వీరిద్దరి బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఆ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. Customer careనుంచి సరైన సహకారం అందకపోవడంతో ఆ ఇద్దరిలో ఒకరు తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, తన బ్యాగును తాను పొందగలగడంతో పాటు, ఇండిగోకు మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఇటువంటి అసౌకర్యం కలిగినందుకు ఎయిర్ లైన్స్ విచారం వ్యక్తం చేస్తూ, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందకుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన మార్చి 27న ఇండిగో 6ఈ-185 విమానంలో పాట్నా నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఆయన లగేజీని పొరపాటున సహా ప్రయాణికుడు తీసుకెళ్లాడు. సహ ప్రయాణికుడి లగేజీని నందన్ తీసుకొచ్చారు. ఇలా బ్యాగులు మారడంలో ఇరువురి పొరపాటు లేదు . ఆ రెండు బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఇలా జరిగింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత నందన్ కుమార్ భార్య ఆ బ్యాగును బాగా పరిశీలించి ఇది మన బ్యాగు కాదని చెప్పింది. మనం తాళం కప్పలను వాడం కదా? అన్నది. దీంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఇండిగో కస్టమర్ కేర్ సంప్రదించారు. ఒకరోజు వేచి చూసినప్పటికీ కస్టమర్ కేర్ నుంచి సరైన సమాధానం రాలేదు. తన బ్యాగ్ ను పట్టి కెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. వ్యక్తిగత గోప్యత, డేటా ప్రొటెక్షన్ అంటూ సాకులు చెప్పారు. ఆ మర్నాడు కూడా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ రాలేదు. ఆ బ్యాగ్ ను పట్టుకెళ్ళిన వ్యక్తి సమాచారం దొరికిన వెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. ఎంతకీ ఫోన్ రాకపోవడంతో కుమార్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు.
@IndiGo6E వెబ్ సైట్ ను తెరిచి F12 బటన్ను నొక్కి, చెక్-ఇన్ ఫ్లోను, నెట్వర్క్ లాగ్ రికార్డును చూశారు. కావలసిన సమాచారం సేకరించారు. తన బ్యాగు పట్టుకెల్లిన సహ ప్రయాణికుడి పిఎన్ఆర్ నెంబర్ తాను తీసుకొచ్చిన బ్యాగుపై ఉండడంతో దాని ఆధారంగా కొంత ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ సహా ప్రయాణికుడి సమాచారం, ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు. అదృష్టవశాత్తు వీరిద్దరూ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. తాను తీసుకొచ్చిన బ్యాగును ఆయనకు ఇచ్చేసి, తన బ్యాగును తిరిగి తీసుకున్నారు.