UAV Crash: ప్రమాదానికి గురైన ఎయిర్ ఫోర్స్ విమానం..

Published : Apr 05, 2022, 04:57 AM IST
UAV Crash:  ప్రమాదానికి గురైన ఎయిర్ ఫోర్స్ విమానం..

సారాంశం

UAV Crash: భారత వైమానిక దళానికి చెందిన మానవరహిత వైమానిక వాహనం (UAV) ప్ర‌మాదానికి గురైంది. సోమవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని IAF ఎయిర్‌బేస్ సరిహద్దు సమీపంలో టేకాఫ్ అయిన వెంటనే ఈ విమానం కూలిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.  

UAV Crash: భారత వైమానిక దళానికి చెందిన మానవరహిత వైమానిక వాహనం (UAV) ప్రమాదానికి గురైంది. సోమవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ప్రమాదం జ‌రిగింది. గాల్లోకి ఎగిరిన విమానం అకస్మాత్తుగా నేలపై కూలిపోయింది. జైసల్మేర్​లోని షాహీద్​ సగర్మల్​ గోపా కాలనీకి సమీపంలో ఈ ఘటన జరిగిన‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ విమానం నివాస ప్రాంతాల‌కు దూరంగా.. కూల‌డంతో  ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏలాంటి న‌ష్టం వాటిల్లేద‌ని అధికారులు తెలిపారు.

విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ రహిత విమానం(యూఏవీ)..రిమోట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది డ్రోన్​ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. దీనిని నిఘా కోసం ఎయిర్​ఫోర్స్ ఉప‌యోగిస్తుంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందనీ, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu