కత్తితో వీరంగం సృష్టించిన కెమికల్ ఇంజినీర్..ఆలయ సెక్యూరిటీపై దాడి.. వైరల్ వీడియో...

Published : Apr 05, 2022, 06:46 AM IST
కత్తితో వీరంగం సృష్టించిన కెమికల్ ఇంజినీర్..ఆలయ సెక్యూరిటీపై దాడి.. వైరల్ వీడియో...

సారాంశం

అతను ఐఐటీ ముంబై ఓల్డ్ స్టూడెంట్, కెమికల్ ఇంజనీర్.. కానీ, ఏమయ్యిందో ఏమో తెలీదు. ఆదివారంనాడు ఓ ఆలయం దగ్గర కత్తితో వీరంగం సృష్టించాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుల మీద దాడికి తెగబడ్డాడు. 

గోరక్ పూర్ :  Gorakhpurలో ఐఐటి పూర్వ విద్యార్థి, Chemical Engineer వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఆలయ సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. IIT ముంబై నుంచి 2015లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన అహ్మద్ ముర్టాజా అబ్బాసీ  కొద్దిరోజుల క్రితమే స్వస్థలమైన గోరక్ పూర్ వచ్చాడు.  అయితే ఆదివారం రాత్రి స్థానిక గోరఖ్నాథ్ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు,  స్థానికులు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అతనిపై రాళ్ల దాడి చేశారు. 

ఆ తర్వాత అతడిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా,ఈ ఘటనపై యూపీ Anti-Terrorist Squad సోమవారం దర్యాప్తు ప్రారంభించింది. ముంబై నుంచి అబ్బాసీ గోరఖ్ నాథ్ ఆలయం వద్దకు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నటు గోరక్ పూర్ ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు. దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు. అయితే 2015 నుంచి తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ముర్టాజా అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్ వెల్లడించారు. దీనివల్ల అతడి వివాహం కూడా రద్దయినట్లు తెలిపారు. నగరంతో పాటు అహ్మదాబాద్ లోని పలు ఆసుపత్రిలో అతడికి చికిత్స చేయించినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా,  సోమవారంనాడు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని యారధోనా గ్రామంలోని మసీదు సమీపంలో ఆదివారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో దాదాపు 40 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనతో రాష్ట్రంలో మతఘర్షణలు పెరిగే ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే చిన్న లౌడ్ స్పీకర్ల సౌండ్ తో ముస్లిం హిందూ గ్రూప్ ల వ్యక్తులు ఈ ఘర్షణకు పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గుంపులుగుంపులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యాలున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఇది ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరిగింది. కానీ ‘దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేరు’ అని రాయచోటికి చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

యారధోనాలోని జామా మసీదు సమీపంలో కొందరు హిందువులు ఉగాది సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. గట్టిగా డిజె సౌండ్ పెట్టారు. ఈ క్రమంలోనే మసీదు చుట్టు ఉగాది వేడుకల్లో భాగంగా హోలీ ఆడుతున్నారు. అక్కడి ముస్లిం వర్గానికి చెందిన పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ