భారత్‌లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్మ‌కాలు.. అగ్ర‌స్థానంలో అజిత్రోమైసిన్   

Published : Sep 07, 2022, 07:20 PM IST
భారత్‌లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్మ‌కాలు.. అగ్ర‌స్థానంలో అజిత్రోమైసిన్   

సారాంశం

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో భారతీయులు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను అధికంగా ఉపయోగించడాన్ని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.    

కోవిడ్-19 మహమ్మారి సమయంలో భార‌తదేశంలో డోలో 650 ట్యాబెట్ల్ అమ్మకాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. డోలో-650 వాడ‌కంపై చ‌ర్చ ఊపందుకున్న‌వేళ‌.. మ‌రో సంచ‌ల‌న నివేదిక వెల్ల‌డైంది. మ‌న‌దేశంలో విచ్చ‌ల‌విడిగా యాంటీబ‌యాటిక్స్ ను వినియోగిస్తున్న‌ట్టు లాన్సెట్ రీజినల్ హెల్త్ ఆగ్నేయాసియా జర్నల్ వెల్ల‌డించింది. 2019లో భారతీయులు 500 కోట్లకు పైగా యాంటీబయాటిక్‌లను వినియోగించిన‌ట్టు తేలింది. 

ఇందులో ప్రధానంగా అజిత్రోమైసిన్ ను ఎక్కువగా వినియోగించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్ అమ్మకం, వినియోగం, నియంత్రించడంలో కొత్త నిబంధనల అవసరాన్ని స్థాపించడం, ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేయడం ఈ అధ్యయనం లక్ష్యం. ఈ అధ్య‌యనం యాంటీబయాటిక్స్ వాడ‌కంపై నియంత్ర‌ణ‌లతో పాటు ప్ర‌స్తుత నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయాల‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది.   

లాన్సెట్ రీజినల్ హెల్త్-ఆగ్నేయాసియాలో ప్రచురించబడిన అధ్య‌యనం ప్ర‌కారం.. ఈ ఔషధాలలో చాలా వరకు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్చే ఆమోదించబడలేదు.  మ‌న దేశంలో విస్తృత స్థాయిలో  యాంటీబ‌యాటిక్స్ వాడ‌కం ప్ర‌జారోగ్యానికి ముప్పని  అధ్య‌య‌న పరిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భారతదేశంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పై  అధ్యయనం అవసరమని పేర్కొంది.

డాక్ట‌ర్ల ప్రిస్కిప్ష‌న్ లేకుండా మెడిక‌ల్ షాపుల్లో ఇవ్వ‌డం కూడా ప‌లు యాంటీబ‌యాటిక్స్ విక్ర‌యాలు, ల‌భ్య‌త పెరుగుతోంద‌ని పేర్కొంది.  భార‌తదేశంలో పెద్ద మొత్తంలో యాంటీబ‌యాటిక్ వినియోగిన్నార‌నీ,  అమెరికా, యూర‌ప్ త‌ర‌హాలో ఓషదాల‌ వాడ‌కంపై నిఘా, నియంత్ర‌ణ‌కు కొర‌వ‌డింద‌ని అధ్య‌య‌నం పేర్కొంది. 

జాతీయ, రాష్ట్ర-స్థాయి ఏజెన్సీల మధ్య నియంత్రణ లేక‌పోవ‌డం కూడా దేశంలో యాంటీబయాటిక్ లభ్యత, అమ్మకం, వినియోగాన్ని క్లిష్టతరం చేస్తుందని అధ్యయనం పేర్కొంది. అనేక దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో యాంటీబయాటిక్స్ తలసరి వినియోగం రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశం పెద్ద మొత్తంలో బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్‌ను వినియోగిస్తుందని అధ్యయనం తెలిపింది. న్యూ ఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆష్నా మెహతా చేసిన సహకారాన్ని కూడా ఈ అధ్యయనం గుర్తించింది.

భారతదేశం అంతటా అమ్మకాల డేటాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9,000 మంది ప్యానెల్ నుండి సేకరించిన ప్రైవేట్ సెక్టార్ డ్రగ్ సేల్స్ డేటాసెట్ అయిన ఫార్మాట్రాక్ నుండి డేటాను విశ్లేషించినట్లు పరిశోధకులు తెలిపారు.

యాంటీబ‌యాటిక్స్ వాడ‌కంలో మ‌న‌దేశం అత్య‌ధికంగా అజిత్రోమైసిన్‌ను వాడ‌గా, ఆ త‌ర్వాత సెఫిక్సిమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అధికంగా వాడార‌ని బోస్ట‌న్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ ఎపిడెమాల‌జీ, ప‌బ్లిక్ హెల్త్ ఫౌండేష‌న్ ఆఫ్ ఇండియా ప‌రిశోధ‌నలో తేలింది. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !