గాజాలోనూ భారతీయులు, 230 మందితో ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు రేపు ఫస్ట్ ఫ్లైట్: కేంద్రం

By Mahesh K  |  First Published Oct 12, 2023, 7:53 PM IST

ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆపరేషన్ అజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో 230 మంది భారతీయులతో తొలి విమానం ఇండియాకు బయల్దేరనుంది. శుక్రవారం భారత్‌లో ల్యాండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
 


న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపు హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ రెండు దేశాల్లో చిక్కుకున్న భారతీయులు, స్వదేశానికి రావాలని అనుకుంటున్న భారతీయులను తీసుకురావడానికి భారత్ ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఇజ్రాయెల్ నుంచి 230 మంది భారతీయులతో తొలి విమానం ఇండియాకు రానుంది. అన్ని అనుకున్నట్టు సాగితే శుక్రవారం ఈ తొలి విమానం భారత్‌కు చేరనుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ రోజు కీలక విషయాలు వెల్లడించారు.

ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది వరకు భారతీయులు ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాదు, గాజా స్ట్రిప్, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోనూ భారతీయులు ఉన్నట్టు వివరించారు. గాజాలో నలుగురు, వెస్ట్ బ్యాంక్‌లో 12 మంది భారతీయులు ఉన్నట్టు చెప్పారు.

Latest Videos

undefined

Also Read: బందీలను విడిచిపెట్టే వరకు గాజాకు తాగు నీరు, విద్యుత్, ఇంధనం బంద్: ఇజ్రాయెల్ వార్నింగ్

వీరు ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్దకు వెళ్లి తమ పేరు నమోదు చేసుకోవాలని అరిందమ్ బాగ్చి సూచించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిలో అక్కడి నుంచి భారతీయులను ఇండియాకు ఆపరేషన్ అజయ్ కింద తీసుకువస్తామని తెలిపారు.

అక్కడి పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నామని బాగ్చి చెప్పారు. ఇజ్రాయెల్‌లో ఒక ఇండియన్ గాయపడ్డారని, ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు వివరించారు. గాజాలోని భారతీయుల రక్షణ కూడా తమకు ప్రాధాన్యతా అంశమే అని చెప్పారు.

click me!