ఇంటి ముందు నీళ్లు పారబోశాడని దళితుడి హత్య.. మైనర్ బాలికకూ గాయాలు

ఇంటి ముందు నీళ్లు పారబోశాడని ఓ దళిత వ్యక్తిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చి చంపగా ఆ దళితుడు స్పాట్‌లోనే మరణించాడు.
 


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాలా చిన్న వివాదానికి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కౌసాంబి జిల్లాలో జరిగింది. పొరుగునే ఉండే దళితుడు తన ఇంటి ముందు నీటిని కుమ్మరించిపోయాడని నిందితుడు ఆగ్రహించాడు. అంతేకాదు, ఇంటిలో నుంచి పిస్టల్ తీసుకువచ్చి ఆ దళితుడిని చంపేశాడు.

సైని పోలీసు స్టేషన్ పరిధిలోని దుమాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్పీ సమర్ బహదూర్ సింగ్ ఈ ఘటన గురించి వివరించారు. 35 ఏళ్ల రామనెవాజ్ రాయిదాస్‌ను రాహుల్ విశ్వకర్మ చంపేశాడని తెలిపారు.

Latest Videos

Also Read: ఎన్నికలను బహిష్కరించిన ఆ రెండు గ్రామాలు.. ‘ఇప్పటికీ కనీస వసతులు లేవు’

బుధవారం రాత్రి రాహుల్ ఇంటి ముందు రాయిదాస్ నీళ్లు ఒలకబోశాడు. దీన్ని రాహుల్ అడ్డుకున్నాడు. ఈ చిన్న వాదం గొడవగా మారింది. ఆగ్రహంతో రాహుల్ తుపాకీ తీసుకువచ్చి రాయిదాస్‌ను కాల్చేశాడు. దీంతో రాయిదాస్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటనలో 16 ఏళ్ల మైనర్ బాలిక కూడా గాయపడింది.

ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 కింద, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. రాయిదాస్‌ను కాల్చి చంపిన తర్వాత రాహుల్ పారిపోయాడు. ప్రస్తుతం రాహుల్‌ను గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

click me!