Indian passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 లో భారత్ తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. ఇప్పుడు భారతీయ పౌరులు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. 57 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తూ పాస్ పోర్టు ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకుని 80వ స్థానంలో నిలిచింది.
Henley Passport Index 2023: భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇకపై ఒమన్, ఖతార్ సహా 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ గమ్యస్థానాలు భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ ను అందిస్తాయి. ఇటీవల విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ ఇప్పుడు 80 వ స్థానంలో ఉంది. ఇది 57 దేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యాలను అందిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్ పోర్టు..
ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ పాస్ పోర్టు లేదా బలమైన పాస్ పోర్టు సింగపూర్ కు చెందినదనీ, దాని హోల్డర్లు అత్యధిక గ్లోబల్ యాక్సెస్ ను అనుభవిస్తున్నారని హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ వెల్లడించింది. సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్లతో 192 దేశాలకు ప్రయాణించవచ్చని తెలిపింది. 190 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్లతో జర్మనీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్ లతో ఆ దేశం రెండో ర్యాంకును పంచుకుంటోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ప్రపంచంలోని టాప్ 22 స్ట్రాంగ్ పాస్‌పోర్ట్ లు ఇవే..
ఈ దేశాలకు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రయాణం..