రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ సమస్యపై చర్చించేందుకు సిద్దమన్న కేంద్రం..

Published : Jul 19, 2023, 04:21 PM IST
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ సమస్యపై చర్చించేందుకు సిద్దమన్న కేంద్రం..

సారాంశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల రేపటి (జూలై 20)  నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార, విపక్ష పార్టీ వారి వ్యూహాలను ఇప్పటికే సిద్దం చేసుకుంటున్నాయి.

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల రేపటి (జూలై 20)  నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార, విపక్ష పార్టీ వారి వ్యూహాలను ఇప్పటికే సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మణిపూర్ హింసాకాండను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. 

వర్షాకాల సమావేశానికి ముందు జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మణిపూర్‌లో 80 మందికి పైగా మరణించిన హింసాకాండతో సహా అన్ని విషయాలను పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ హింసతో పాటు ధరల పెరుగుద, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రెజర్ల ఆందోళన.. వంటి అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విపక్ష పార్టీలు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. అలాగే మణిపూర్‌‌లో చోటుచేసుకున్న హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్న సంగతి తెలిసిందే. 

ఇదే విషయానికి సంబంధించి గత వారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘మణిపూర్ కాలిపోయింది. ఈయూ పార్లమెంటు భారతదేశ అంతర్గత విషయంపై చర్చిస్తుంది. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు! ఇంతలో రాఫెల్ అతనికి బాస్టిల్ డే పరేడ్‌కు టిక్కెట్‌ను పొందాడు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభం కానున్నాయి. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి.

PREV
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?