కెనడాలో భారతీయ విద్యార్థి కళాశాల సెలవుల్లో పిజ్జా డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై కొందరూ దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి .. చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటన కెనడాలోని మిస్సిసాగాలోని బ్రిటానియా & క్రెడిట్‌వ్యూ రోడ్‌లో జరిగింది.
కెనడాలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ విద్యార్థిపై కొందరూ దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన ఆ విద్యార్థి చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన జులై 9 తెల్లవారుజామున బ్రిటానియా, క్రెడిట్‌వ్యూ రోడ్‌ల వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని గుర్విందర్ నాథ్ గా గుర్తించారు. అతడు బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేస్తూ.. పార్ట్ టైంగా ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.
గుర్విందర్ తెల్లవారుజామున 2.10 గంటలకు పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కొందరూ దుండగులు గుర్విందర్ పై దాడికి పాల్పడి.. అతని కారును దొంగిలించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. దుండగుల దాడిలో గుర్విందర్ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. గుర్విందర్ నాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ జులై 14 మృతి చెందాడు.
పిజ్జా డెలివరీ సమయంలో దాడి
నివేదికల ప్రకారం.. గుర్విందర్ కెనడాలోని ఒక బిజినెస్ స్కూల్‌లో చివరి సెమిస్టర్ విద్యార్థి , బ్రాంప్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతని కాలేజీకి వేసవి సెలవులు. అటువంటి పరిస్థితిలో.. గుర్విందర్ పిజ్జా డెలివరీలో పని చేయడం ప్రారంభించాడు. జూలై 9న గుర్విందర్ తెల్లవారుజామున 2.10 గంటలకు పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆయన కారును కొందరు దొంగిలించేందుకు ప్రయత్నించారు. గుర్విందర్ నిరసన వ్యక్తం చేయడంతో.. నిందితులు అతనిపై దాడి చేశారు, ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
తలకు బలమైన గాయం ..
ఈ దాడిలో గుర్విందర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో జులై 14న గుర్విందర్ మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు నిందితులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, పిజ్జా డెలివరీ కూడా కుట్రపూరితంగానే జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. సంఘటన స్థలం నుండి కొంత దూరంలో వాహనాన్ని వదిలి పారిపోయారు.
భారతీయ సమాజం సహాయం
భారతీయ యువకుడి మృతి పట్ల కెనడాలోని భారత కాన్సుల్ జనరల్ సిద్ధార్థనాథ్ సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు బాధిత కుటుంబానికి సహాయ హస్తం అందించిన తీరు చూస్తుంటే.. సంతోషం కలుగుతోందని నాథ్ అన్నారు. ఈ నష్టాన్ని పూడ్చలేమని, అయితే బాధిత కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. కెనడాలోని హైకమిషన్ సహాయంతో గుర్విందర్ మృతదేహం జూలై 27న భారత్‌కు చేర్చానున్నది. అదే సమయంలో మిస్సిసాగా ప్రజలు భారతీయ యువకుడి హత్యకు వ్యతిరేకంగా క్యాండిల్ మార్చ్ చేపట్టారు.