ప్రాణం తీసిన రీల్స్‌ మోజు..! జలపాతంలో జారిపడ్డ యువకుడు .. క్షణాల్లో..

Published : Jul 25, 2023, 03:43 AM IST
ప్రాణం తీసిన రీల్స్‌ మోజు..! జలపాతంలో జారిపడ్డ యువకుడు .. క్షణాల్లో..

సారాంశం

కర్ణాటకలోని జలపాతం దగ్గర రీలు తీస్తుండగా ఓ యువకుడి కాలు జారి పడ్డాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే అధికారులు ఇప్పటి వరకు అతడి జాడ కనిపెట్టలేకపోయారు.  

దేశవ్యాప్తంగా కురుస్తున్నభారీ వర్షాలు జనజీవనాన్ని కష్టతరం చేశాయి. ఈ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ప్రమాదం స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో ఒక బాధాకరమైన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. అరసినగుండి జలపాతంలో ఓ వ్యక్తి జారి పడిపోయాడు. ఈ ఘటనను అతడి స్నేహితుడు కెమెరాలో బంధించాడు. 

వార్త కథనాల ప్రకారం.. కర్ణాటకలోని ఓ యువకుడు ఆదివారం సాయంత్రం శివమొగ్గలోని కొల్లూరు సమీపంలోని అరసినగుండి జలపాతం వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కొట్టుకుపోతూ కనిపించాడు. అతను నటిస్తున్నప్పుడూ అతని స్నేహితుడు షూటింగ్ చేస్తున్న సమయంలో విషాద సన్నివేశం చోటుచేసుకుంది. ఆ తర్వాత వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

అయితే అధికారులు ఇప్పటి వరకు అతడి జాడ కనిపెట్టలేకపోయారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి నది అంచున నిలబడి ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. క్షణాల వ్యవధిలో అతను నదిలోకి జారిపడి, భారీ నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాడు. కర్ణాటకలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీ మరణాలు చోటుచేసుకున్నాయి. గతేడాది నవంబర్‌లో బెలగావి జిల్లాలోని కిత్వాడ్ జలపాతం సమీపంలో సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో జారిపడి నలుగురు బాలికలు మరణించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బెలగావి జిల్లాలోని ప్రముఖ గోకాక్ జలపాతం దగ్గర సెల్ఫీలు తీసుకోవడం నిషేధించింది. నేరస్థులపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

అలాగే..  ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో కొంతమంది యువకులు డేరింగ్ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేవారు. అది వారి అలవాటుగా మారిపోయింది. ఎప్పటి లాగానే ఓ రోజు రీల్స్ షూటింగ్ చేయడానికి ఓ నది దగ్గరకి వెళ్లారు. నదిలో విన్యాసాలు చేస్తూ.. రీల్స్ షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సమయంలో ముగ్గురు యువకులు నది ప్రవాహంలో మునిగిపోవడం ప్రారంభించారు. వారు మునిగిపోవడం చూసిన రీల్స్ షూట్ చేసిన వ్యక్తి  తన ఇద్దరూ స్నేహితులను నదిలో నుండి ఎలాగోలా సురక్షితంగా బయటకు తీశాడు. కాని మూడవ యువకుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.   

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం