Bhawna Dehariya: ఐరోపాలోని ఎత్తైన శిఖరంపై మువ్వన్నెల రెపరెపలు.. భారతీయ పర్వతారోహకురాలి అదురైన పిట్

By Rajesh KFirst Published Aug 15, 2022, 11:00 PM IST
Highlights

Bhawna Dehariya:76వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారతీయ పర్వతారోహకురాలు భావా డెహ్రియా యూరప్‌లోని ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Bhawna Dehariya: యావత్ భారతదేశం నేడు స్వాతంత్య్ర మకరందోత్సవాన్ని ఘ‌నంగా జరుపుకుంటున్న వేళ.. విదేశీ గడ్డపై (రష్యా) భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భార‌త ప‌ర్వోతారోహ‌కురాలు, ఎవరెస్ట్ విజేత భావా డెహ్రియా దేశ గౌరవాన్ని మరింత‌ పెంచింది. సముద్ర మట్టానికి 5642 మీటర్ల (18,510 అడుగులు) ఎత్తులో ఉన్న‌ ఐరోపాలోని మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని ఆదిరోహించి.. భార‌త‌ జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసింది. ఇలా భార‌త జాతి ఖ్యాతి ప్ర‌పంచ‌వ్యాప్తం చేసింది. ఎల్బ్రస్ శిఖరం రష్యా-జార్జియా సరిహద్దులో ఉంటుంది. భోపాల్ చెందిన‌ 30 ఏళ్ల భావన డెహ్రియా చింద్వారా జిల్లాలోని తామియా గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె 15 నెలల కుమార్తెకు తల్లి.  ఆమె తన కూతురుకు జ‌న్మ‌నిచ్చిన‌ తర్వాత చేసిన మొదటి పర్వతారోహణ యాత్ర ఇది.

జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేసిన త‌రువాత ఆమె ఒక సందేశం ఇచ్చింది.  'మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరంపై వాతావరణం చాలా చల్లగా ఉంది, గాలులు గంటకు 35 కిమీ వేగంతో వీస్తున్నాయి, ఇక్క‌డ మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత న‌మోదవుతోంది. ఈ అత్యంత శీతల వాతావరణంలో కొన్ని నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టం. కానీ భార‌త జాతి కోసం..  గర్భధారణ తర్వాత.. న‌న్ను నేను మానసికంగా సిద్ధం చేసుకున్నాను. ప్ర‌తి రోజు టామియా పర్వతాలలో క‌ఠోర‌ సాధన చేసాను. ఈ సాధ‌న‌నే నేడు న‌న్ను రికార్డు సమయానికి ముందే ఎల్బ్రస్ పర్వతం పైకి విజయవంతంగా తీసుకువ‌చ్చింది. అని పేర్కొన్నారు.  ఈ ప‌ర్వ‌తాన్ని ఆధిరోహించ‌డానికి ఆగస్ట్ 13 రాత్రి శిఖరం బేస్ నుంచి బయలుదేరినట్లు పర్వతారోహకురాలు చెప్పారు. ఆగస్ట్ 15 తెల్లవారుజామున చేరుకున్నారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్బ్రస్ వెస్ట్ పర్వతం పైన నేను త్రివర్ణ పతాకాన్ని  ఎగురవేసాను. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దతుతో ఈ ప్రచారం విజయవంతమైందని,  ఈ యాత్ర‌ అత్యంత కష్టతరమైనది,  శారీరకంగా అలసిపోయిందని భావనా ​​డెహ్రియా త‌న వీడియో పేర్కొన్నారు .


ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా జయించారు

భావా డెహ్రియా ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఆధిరోహించారు. మే 22, 2019న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఈ ఫిట్ తో మధ్యప్రదేశ్‌కు చెందిన మొదటి మహిళగా భావా డెహ్రియా రికార్డు సృష్టించారు. అదే సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్కియుస్కో పర్వతాన్ని కూడా అధిరోహించారు. ఆమె ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని కూడా ఆమె ఎక్కింది. 

click me!