భారతీయ మహిళా స్కైడైవర్ సరికొత్త రికార్డు.. మౌంట్ ఎవరెస్ట్ ముందు 21,500 అడుగుల నుండి దూకి.. అద్భుతం..

By SumaBala Bukka  |  First Published Nov 15, 2023, 2:27 PM IST

భారతీయ స్కైడైవర్ శీతల్ మహాజన్ మౌంట్ ఎవరెస్ట్ పర్వతం 21,500 అడుగుల పై నుండి దూకిన ప్రపంచంలోనే మొదటి మహిళ.


ఎత్తు చూస్తేనే కళ్లుతిరుగుతాయి. కానీ ఓ మహిళ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తునుంచి కిందికి దూకి.. ఎవరెస్ట్ పర్వతం ముందు 21,500 అడుగుల ఎత్తు నుండి హెలికాప్టర్ నుండి దూకి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా ఘనత సాధించింది. ప్రముఖ భారతీయ స్కైడైవర్ శీతల్ మహాజన్ సరికొత్త రికార్డును సాధించించారు.

41 ఏళ్ల మహాజన్, నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ గ్రహీత, అనేక స్కైడైవింగ్ రికార్డులు తన పేరుతో ఉన్నాయి. నవంబర్ 13న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ముందు స్కైడైవింగ్ పూర్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. “ఎవరెస్ట్ పర్వతం ముందు 21,500 అడుగుల నుండి దూకి నా జీవితంలో అత్యుత్తమైన జంప్ చేసాను. కాలాపత్తర్ దగ్గర 17,444 అడుగులు / 5,317 మీ ఎత్తులో దూకాను. 

Latest Videos

Doda Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మందికి పైగా మృతి

ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో స్కైడైవింగ్ చేసిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ సాధించాను’ అని చెప్పారు. కాలాపత్తర్ వద్ద ఎవరెస్ట్ పర్వతం ముందు స్కైడైవింగ్ చేసిన మొదటి భారతీయ మహిళగా, ఒక మహిళ చేసిన ఎత్తైన స్కైడైవింగ్ ల్యాండింగ్ అనే 2 జాతీయ రికార్డు సాధించానని చెబుతూ.. ఆమె తన సోషల్ మీడియా ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

మహాజన్ ఎవరెస్ట్ ప్రాంతంలో ఎత్తైన స్కైడైవ్‌లు చేసిన ఘనత సాధించారు. నవంబర్ 11న, మహాజన్ 17,500 అడుగుల ఎత్తులో 5,000 అడుగుల గ్రౌండ్ లెవెల్ నుండి తన మొదటి జంప్ చేసింది. న్యూజిలాండ్‌కు చెందిన లెజెండరీ స్కైడైవర్ వెండి స్మిత్ విమానంలో శిక్షకురాలిగా సేవలందిస్తూ సియాంగ్‌బోచే విమానాశ్రయంలో 12,500 అడుగుల వద్ద విజయవంతంగా ల్యాండ్ అయింది.

నవంబర్ 12న, మహాజన్ స్కైడైవింగ్ లెజెండ్ కెమేరా ఉమెన్ వెండీ ఎలిజబెత్ స్మిత్, నదియా సోలోవివాతో కలిసి స్యాంగ్‌బోచే విమానాశ్రయంలో 8,000 అడుగుల నుండి భారత జెండాతో ఫ్లాగ్ జంప్ చేసి, ఒక మహిళ ఎత్తైన ఫ్లాగ్ స్కైడైవింగ్ ల్యాండింగ్‌గా జాతీయ రికార్డును సాధించారు.
 

click me!