ఐశ్వర్యరాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన అబ్దుల్ రజాక్...

By SumaBala Bukka  |  First Published Nov 15, 2023, 1:37 PM IST

ఆ సమయంలో రజాక్ వ్యాఖ్యను తాను సరిగా వినలేదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పమని రజాక్‌ను కోరానని షాహిద్ అఫ్రిది అన్నారు.


బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో, రజాక్ అనుచిత వ్యాఖ్య చేయడంతో సోషల్ మీడియాలో, తోటి క్రికెటర్లలో తీవ్ర విమర్శల పాలయ్యాడు. 

వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనను గురించి ప్రస్తావిస్తూ  అబ్దుల్ రజాక్ దారుణమైన కామెంట్ చేశారు. కరాచీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ జట్టు ప్రదర్శనను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తో పోలుస్తూ కించపరిచేలా కామెంట్ చేశాడు.  జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘ఉదాహరణకు.. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయను నేను పెళ్లాడాలనుకుంటే మంచిదే. కానీ, పిల్లలు పవిత్రంగా పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు’ అంటూ నోటికొచ్చినట్లుగా కారుకూతలు కూశాడు.

Latest Videos

ఆ సమయంలో ఆయన పక్కనే ఆ దేశ మాజీ క్రికెటర్లు  షాహిద్ ఆఫ్రిది, ఉమర్గుల్ ఉన్నారు. ఈ కామెంట్స్ విన్న తరువాత వారు అతడిని వారించడం మానేసి.. సమర్థిస్తూ చప్పట్లు కొట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో భారత క్రికెట్ అభిమానులు, తోటి క్రికెటర్లు మండిపడ్డారు. తరాలు మారుతున్నా పాకిస్తాన్ క్రికెటర్ల బుద్ధి మారడం లేదని విమర్శలు వెళ్లివెత్తాయి. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైన రజాక్ సమా టీవీలో కనిపించి తన వ్యాఖ్యల మీద ఐశ్యర్యారాయ్ ను బేషరతుగా క్షమాపణలు అడిగారు. 

ఆయన మాట్లాడుతూ..  “నిన్న, మేం క్రికెట్ కోచింగ్, ఉద్దేశాల గురించి మాట్లాడుకున్నాం. నాకు టంగ్ స్లిప్ వచ్చింది. యు పొరపాటున ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు'' అని చెప్పుకొచ్చారు. 

రజాక్ వ్యాఖ్యలపై పలువురు మాజీ సహచరులు, క్రికెట్ సంఘంలోని ప్రముఖులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత క్షమాపణలు వచ్చాయి. ఫాస్ట్ బౌలింగ్‌లో పేరుగాంచిన షోయబ్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన వారిలో ఒకరు. సోషల్ మీడియాలో "ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదు" అని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి హాజరై, చప్పట్లు కొడుతూ కనిపించిన షాహిద్ అఫ్రిది, ఆ  తరువాత స్పందిస్తూ.. ఆ సమయంలో రజాక్ వ్యాఖ్యను తాను సరిగా వినలేదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పమని రజాక్‌ను కోరానని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు.

click me!