India-Pakistan War : పాక్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్ ... వీడియో విడుదలచేసిన ఆర్మీ

పాకిస్తాన్ సైన్యం చేసిన మిస్సైల్, డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది, ఈ క్రమంలోనే సరిహద్దులో భారత సైన్యం పాక్ డ్రోన్లను కూల్చివేసిసిన వీడియోను వీడియోను విడుదల చేసింది. ఇది ఇక్కడ చూడండి. 

 

 

Google News Follow Us

పాకిస్తాన్ సైన్యం భారత్ పై చేసిన దాడులను సమర్ధవంతంగా అడ్డుకుంది ఆర్మీ. ఈ క్రమంలోనే పాక్ మిస్సైల్స్, డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం తిప్పికొట్టింది. ఆకాశంలోనే పాక్ డ్రోన్స్ ను పేల్చిసిన వీడియోను తాజాగా భారత ఆర్మీ విడుదల చేసింది. 

 

 గురువారం రాత్రి పశ్చిమ సరిహద్దులో భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని శుక్రవారం భారత సైన్యం ధృవీకరించింది. “మే 8, 9 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో కాల్పుల విరమణను కూడా ఉల్లంఘించింది” అని భారత సైన్యం ఎక్స్ లో పేర్కొంది.

“డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తగిన ప్రతిస్పందన ఇచ్చాం. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత సైన్యం కట్టుబడి ఉంది. దుష్ట పన్నాగాలన్నింటినీ బలంతో ఎదుర్కొంటాం" అని సైన్యం ప్రకటించింది.

 నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 50కి పైగా పాకిస్తాన్ డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ANI వార్తా సంస్థ తెలిపింది. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్లను భారత్ అడ్డుకుంది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్‌లలో భారత సైన్యం భారీ ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్ నిర్వహించి సరిహద్దు దాటి వచ్చిన 50కి పైగా డ్రోన్లను కూల్చివేసింది.

"L-70 గన్స్, Zu-23mm, Schilka వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలను ఉపయోగించి వైమానిక ముప్పును ఎదుర్కొనే సామర్థ్యాన్ని సైన్యం ప్రదర్శించింది" అని ANI తెలిపింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన ఘటన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది. బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కేంద్రంగా ఉన్న బహవల్పూర్ కూడా ఈ దాడుల్లో ఉంది.

Read more Articles on