పురుషులకు నగ్నచిత్రాలు పంపి, బ్లాక్ మెయిల్.. కాపురంలో నిప్పులు పోసి, డబ్బులు వసూలు చేసి.. కిలేడీ అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Dec 19, 2022, 10:18 AM IST
Highlights

నగ్నచిత్రాలు పంపి కాపురంలో చిచ్చుపెట్టి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న ఓ కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

కర్ణాటక : పురుషుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలకు వసూలు చేస్తున్న ఓ కిలాడి లేడీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొదట పురుషులతో పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత వారి వాట్సాప్ నెంబర్ తీసుకుంటుంది. దానికి తన నగ్న చిత్రాలు పంపిస్తుంది. వాటితో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది. ఆ మహిళను పక్కా ప్లాన్ తో పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు సవిత అలియాస్ మంజుల యాదవ్. అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే..  భార్య చేసే పని భర్తకు తెలుసు. అలా చేయడం మంచిది కాదని ఆయన అనేక సార్లు మందలించాడు. గొడవ పడ్డాడు, దాడి కూడా చేశాడు… అయినా ఆమె తీరు మార్చుకోలేదు.  దీంతో ప్రస్తుతం  అరెస్టై జైలులో ఉంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  సవిత మైసూరులోని విజయనగరలో నివాసం ఉంటుంది. ఆమె మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాకు చెందిన వ్యక్తి. ఆమె  ఆమె తన చుట్టుపక్కల ఉన్న  దంపతుల ఇంటికి వెళ్లి తాను పేదదాన్ని అని, సాయం  చేయమని అడుగుతుంది. డబ్బులు అడిగి తీసుకుంటుంది. ఆ పరిచయంతో వారితో టచ్ లో ఉంటుంది. తర్వాత భార్యభర్తలిద్దరితో వరుసలు మార్చి మార్చి మాట్లాడేది. దీనితో భార్యభర్తల మధ్య అనుమానాలు రేకెత్తించి, సంసారంలో గొడవలు పెట్టేది. పెళ్లైన వారిని, యువకులను పరిచయం చేసుకునేది. ఆ తర్వాత వారితో తరచుగా ఫోన్లలో చాటింగ్ చేసేది. ఈ క్రమంలో తన నగ్నచిత్రాలు పంపించి, బెదిరింపులకు దిగుతుంది. దీంతో భయపడి ఆమె అడిగినంతా ఇచ్చేవారు.

ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడబోను - పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో

ఈ విషయం తెలిసిన ఆమె భర్త అది మంచిది కాదంటూ గొడవ పడ్డాడు. వీరిద్దరి గొడవలతో ఒకసారి ఆమె మీద చాకుతో దాడి కూడా చేశాడు. అయినా సవిత తన తీరు మార్చుకోలేదు. ఎంతోమంది పురుషులకు ఇలా తన నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. విజయనగరం లోని రెండవ స్టేజ్లో అభిషేక్ రోడ్డులో ఓ స్పా ఉంది. అందులో  వేసి వ్యభిచార గృహాన్ని కూడా నడుపుతోందని పోలీసులు చెప్పుకొచ్చారు. సవిత  మీద అనేక ఫిర్యాదులు రావడంతో..  రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై కేసు పెట్టి,  అరెస్టు చేశారు.

click me!