భారత యుద్ధతంత్రం: సర్జికల్ స్ట్రైక్స్‌కు ఎయిర్‌ఫోర్స్ వ్యూహం ఇదే..!!!

By Siva KodatiFirst Published Mar 4, 2019, 10:13 AM IST
Highlights

పాక్ భూభాగంలోకి ప్రవేశించి బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే

పాక్ భూభాగంలోకి ప్రవేశించి బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.

శత్రు భూభాగంలోకి ప్రవేశించి అంతే దర్జాగా, సురక్షితంగా వెనక్కి వచ్చిన భారత యుద్ధ వ్యూహం ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యంలో పడేసింది. ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిపుణులు అద్భుతమైన వ్యూహరచన చేశారు.

సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న పాక్ యుద్ధ విమానాల దృష్టి మరల్చేందుకు గాను ఐఏఎఫ్ ‘‘డికాయ్ ప్యాకేజ్ (ఉత్తుత్తి దాడి బృందం)ను ఏర్పాటు చేసింది. ఎయిర్ స్ట్రైక్స్‌ కోసం కావాల్సిన యుద్ధ విమానాలన్నీ సరిహద్దుల వెంబడి ఉన్న వైమానిక స్థావరాల నుంచి కాకుండా దూరంగా ఉన్న ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, బరేలి నుంచి బయలుదేరాయి.

డికాయ్ ఆపరేషన్ భాగంగా పాక్ గస్తీ విమానాల కంట్లో పండేందుకు గాను కొన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానాలు పాక్.. పంజాబ్ ప్రావిన్సులోని జైషే ప్రధాన స్థావరం బహావల్‌పూర్ దిశగా కదులుతున్నట్లు భ్రమింపజేశాయి.

దీంతో పాక్ ఫైటర్ జెట్లు.. సుఖోయ్ విమానాలను వెంబడించాయి. ఇదే అదనుగా మిరాజ్-2000 యుద్ధ విమానాలతో కూడిన దాడి బృందం గాల్లోకి లేచింది. వ్యూహాం ప్రకారం పీఓకే రాజధాని ముజఫరాబాద్‌కు చేరుకోవడానికి నేరుగా కాకుండా చుట్టు తిరిగి వచ్చాయి.

పాకిస్తాన్ జెట్‌లు దారి మళ్లడంతో అడ్డు అదుపు లేకుండా విజృంభించిన ఇండియన్ ఫైటర్ జెట్లు ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే పాక్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ భారత విమానాలను వెంబడించింది. భారత యుద్ధ విమానాలు ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు వేయలేదని, కేవలం చెట్లపైనే దాడి చేశాయని పాక్ చెప్పడం గమనార్హం.

అవన్నీ గాలి వార్తలే... మసూద్ బతికే ఉన్నాడు: పాక్ మీడియా

click me!