పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

Siva Kodati |  
Published : Mar 04, 2019, 09:54 AM IST
పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

సారాంశం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే... కట్ని జిల్లాకు చెందిన ఓ బాలిక గత బుధవారం తన సమీప బంధువు వెంట వెళ్లింది.

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే... కట్ని జిల్లాకు చెందిన ఓ బాలిక గత బుధవారం తన సమీప బంధువు వెంట వెళ్లింది.

ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. తన కన్నా ముందే ఇంటికి వచ్చేసిందనుకున్నా అని బదులిచ్చాడు. దీంతో చిన్నారి కుటుంబసభ్యులంతా కలిసి అంతటా వెతికారు.

ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కట్నికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఒక బయోగ్యాస్ తయారు చేసే ట్యాంక్ కనిపించింది.

అందులోంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన అక్కడి రైతులు అక్కడికి వెళ్లి చూశారు. ఆ ట్యాంక్‌లో ఒక బాలిక శవం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదికలో బాలిక అత్యాచారానికి గురైనట్లు తేలింది. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్