సీన్ రివర్స్.. సుమలత ఔట్.. హీరో నిఖిల్ ఇన్..

Published : Mar 04, 2019, 09:57 AM IST
సీన్ రివర్స్.. సుమలత ఔట్.. హీరో నిఖిల్ ఇన్..

సారాంశం

మాండ్యా లోక్ సభ సీటు ఎవరికి దక్కుతుంది అనే విషయంపై స్పష్టత వచ్చేసింది.

మాండ్యా లోక్ సభ సీటు ఎవరికి దక్కుతుంది అనే విషయంపై స్పష్టత వచ్చేసింది. లోక్‌సభ ఎన్నికల టికెట్‌లపై సంకీర్ణ పార్టీల మధ్య స్పష్టత రాకపోయినా మండ్యనుంచి సీఎం కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్‌ పోటీ చేయడం ఖరారైంది. మొన్నటి వరకు ఈ సీటు నుంచి సినీనటి సుమలత  పోటీ చేస్తారని అందరూ భావించారు. ఈ సీటు కోసం మొదటి నుంచి నిఖిల్ ప్రయత్నించినప్పటికీ..సుమలతకే దక్కుతుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. 

మైసూరు పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి, మంగళూరులో జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాసేపటికే నిఖిల్‌ మండ్యలో కార్యకర్తలతో కలసి సంబరం చేసుకున్నారు. పెద్దల ఆశీర్వాదంతో మండ్యలో సేవలకు సిద్ధమవుతానని ప్రకటించారు. మండ్యనుంచి నిఖిల్‌, హాసన్‌ నుంచి ప్రజ్వల్‌లు పోటీ చేయడం ఖరారు చేశారు.

ఇటీవలే.. సుమలత తాను మాండ్య నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే.. జేడీఎస్, కాంగ్రెస్ పొత్తులో ఉన్న నేపథ్యంలో.. సుమలత రాజకీయ ప్రవేశం ప్రశ్నార్థకంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం