కార్గిల్ యుద్ధం తర్వాత... తొలిసారి పీఓకే దాటిన ఎయిర్‌ఫోర్స్

By Siva KodatiFirst Published Feb 26, 2019, 10:43 AM IST
Highlights

భారతదేశ త్రివిధ దళాల్లో వైమానిక దళానిది ప్రత్యేక స్థానం. దేశ గగనతలాన్ని కాపాడుతూ.. నిరంతరం దేశభద్రతతో పాటు ప్రకృతి బీభత్సం వంటి సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

భారతదేశ త్రివిధ దళాల్లో వైమానిక దళానిది ప్రత్యేక స్థానం. దేశ గగనతలాన్ని కాపాడుతూ.. నిరంతరం దేశభద్రతతో పాటు ప్రకృతి బీభత్సం వంటి సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.

తాజాగా పీఓకే‌లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్టైక్స్ నేపథ్యంలో వైమానిక దళానికి జాతి సెల్యూట్ చేస్తోంది. కార్గిల్ యుద్ధంలో పాక్ అండదండలతో ముష్కరులు ఎల్‌ఓసీ దాటి వచ్చి భారత భూభాగంలో తిష్ట వేశారు.

భారత సరిహద్దును ఆనుకోని మాష్కో వ్యాలీ, డ్రాస్ సెక్టార్‌లను ఆక్రమించారు. పూర్తిగా పర్వత ప్రాంతంలో యుద్ధం చేయ్యాల్సి రావడం భారత్‌కు కష్టంగా మారింది. అయినప్పటికీ మన సైనికులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

ఈ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతం ఎల్‌ఓసీకి అత్యంత సమీపంగా ఉండటం వల్ల... ఎల్‌ఓసీని దాటకుండా విధ్వంసం చేయడానికి సాధ్యపడలేదు.

కానీ మిగ్-24, సుఖోయ్ యుద్ధ విమానాలు వ్యూహాత్మకంగా శత్రువును చావు దెబ్బ తీశాయి. తీవ్రవాదుల చాటున పాక్ సైన్యం కూడా తోక ముడవటంతో కార్గిల్ తిరిగి భారత్ వశమైంది.

ఆ యుద్ధం తర్వాత మరే చర్యలోనూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యక్షంగా పీఓకేను దాటలేదు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది.

సహచరుల మరణానికి బదులు తీర్చుకోవాలని ప్రతీకారంతో రగిలిపోతున్న సైన్యానికి దాడి చేయాల్సిందిగా ప్రధాని నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే.. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని 12 యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి వెయ్యి కిలోల బాంబులను జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందని స్థావరాలపై జార విడిచి.. 300 మంది ముష్కరులను హతం చేశాయి. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

click me!