పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

By Siva KodatiFirst Published Feb 26, 2019, 10:27 AM IST
Highlights

యుద్ధరంగంలో వేగం, ఖచ్చితత్వం, పక్కా వ్యూహాం అనేవి అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది.

యుద్ధరంగంలో వేగం, ఖచ్చితత్వం, పక్కా వ్యూహాం అనేవి అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది.

సహచరుల మరణానికి బదులు తీర్చుకోవాలని ప్రతీకారంతో రగిలిపోతున్న సైన్యానికి దాడి చేయాల్సిందిగా ప్రధాని నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే.. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని 12 యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించాయి.

వెయ్యి కిలోల బాంబులను జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందని స్థావరాలపై జార విడిచాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపు.. ఉగ్రవాదులు మేల్కొనేలోపు మన పైలట్లు పని కానిచ్చేశారు.

పాక్ ఆర్మీ తేరుకుని ప్రతీదాడి చేసే లోపు భారత యుద్ధ విమానాలు ఎల్‌ఓసీ దాటి మన భూభాగం మీదకు తిరిగి వచ్చేశాయి. ఈ మెరుపు దాడుల్లో బాలాకోట్, చకోటీ, ముజఫరాబాద్‌లలోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 300 మంది ముష్కరులు కూడా హతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది.

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

click me!