
ముంబై: మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నౌకలను ఇండియా నిర్మిస్తందనడంలో సందేహం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.INS Visakhapatnam, నౌక ఆదివారం నాడు విధుల్లో చేరింది. కేంద్ర మంత్రి Rajnath singh ఈ కార్యక్రమాన్ని mumbaiలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఐఎన్ఎస్ నౌక ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలన కూడా తీర్చబోతోందని చెప్పారు.
ఈ నౌకను ప్రారంభించడం మన ప్రాచీన, మధ్యయుగ భారతదేశం యొక్క సముద్ర శక్తి, నౌక నిర్మాణ నైపుణ్యాలు అద్భుతమైన చరిత్రను గుర్తు చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.భారత్ ఇండో ఫసిఫిక్ ప్రాంతాన్ని నియమాల ఆధారంగా నావినేషన్ స్వేఛ్చ, సార్వత్రిక నియమాలను కలిగి ఉందన్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతం భద్రతలో India ఒక ముఖ్యమైన దేశం ఉందన్నారు. ఇందులో భారత నావికాదళం పాత్ర ముఖ్యమైందిగా మారనుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా భద్రతపై వ్యయం 21 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు., భారతదేశం తన సామర్ధ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి దేశాన్ని స్వదేశీ నౌక నిర్మాణంగా మార్చడానికి ఇప్పుడు పూర్తి అవకాశం కలిగి ఉందని కేంద్ర మంత్రి చెప్పారు.
మేకిన్ ఇండియా కార్యక్రమాల సహాయంతో భారత నావికాదళం 2014లో దేశంలోని 76 శాతం ఎయిర్ ఆపరేషన్స్, నెట్, 66 శాతం కాస్ట్ బేస్ కాంట్రాక్టులను అందించిందని ఆయన గుర్తు చేశారు. నావికాదళంలో మందుగుండు సామాగ్రిని 90 శాతం స్వదేశంలోనే తయారు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
ఐఎన్ఎస్ విశాఖపట్టణం ప్రత్యేకతలు
ఐఎన్ఎస్ విశాఖపట్టణం ఆదివారం నాడు ముంబైలో విధుల్లో చేరింది. భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్. ప్రాజెక్టు 15 బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతనమైన నౌకలను ఇండియా తయారు చేస్తున్నారు. బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికల్ని శత్రు దేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తివంతమైన టోర్పెడోలను పొందుపర్చారు. రెండు మల్టీరోల్ హెలికాప్టర్లు ఇందులో ఉంటాయి.
అత్యంత అప్రమత్తతకు తీవ్రమైన వేగానికి కృష్ణ జింకలు నిదర్శనంగా నిలుస్తాయనే ఉద్దేశ్యంతో ఐఎన్ఎస్ విశాఖపట్టణం నౌక గుర్తింపు చిహ్నాన్ని కృష్ణ జింక ముఖం ఏర్పాటు చేశారు. అంతేకాదు విశాఖలోని డాల్ఫిన్ నోస్ కొండ, దానిపై దీపస్థంబానికి స్థానం కల్పించారు. హిందూ మహా సముద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఐఎన్ఎస్ విశాఖపట్టణం విధుల్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకొంది.