ఈ నెల 24వ తేదీన దుబాయ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెజ్లింగ్ మ్యాచ్ ఉన్నది. ఇందులో భారత్ తరఫున రెజ్లర్ సంగ్రామ్ సింగ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆయన ఏషియానెట్ న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రముఖ రెజ్లర్ సంగ్రామ్ సింగ్ ఏడేళ్ల తర్వాత మళ్లీ రింగ్‌లోకి దిగబోతున్నారు. ఫిబ్రవరి 24 తేదీన పాకిస్తాన్ పహిల్వాన్‌తో తలపడనున్నారు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఏషియానెట్ న్యూస్‌తో ఆయన ఎక్సక్లూజివ్‌గా మాట్లాడారు. రెజ్లింగ్, రెజ్లింగ్ కెరీర్ గురించి, ఫిట్‌నెస్ గురించి కీలక విషయాలు తెలిపారు.
ఫిబ్రవరి 24వ తేదీన భారత్‌కు, మీకు కూడా పెద్ద మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
undefined
నేను ఏడేళ్ల తర్వాత తిరిగి బాక్సింగ్ ప్రపంచంలో అడుగుతుపెడుతున్నాను. పాకిస్తాన్ రెజ్లర్ మొహహ్మద్ సయీద్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అమేచ్యూర్ కేటగిరీలో ఆడుతున్నాడు. ఆయన వయసు 22-23 ఏళ్లు. నేను వైపు నుంచి అన్ని రకాల కసరత్తులు పూర్తి చేశాను. మిగిలినదంతా ఆ పరమాత్ముడి చేతిలో ఉన్నది. ఈ మ్యాచ్ మంచిగా జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను. మ్యాచ్ తర్వాత చాలా మంది నన్ను ట్రోల్స్ చేయవచ్చు. కానీ, నా లక్ష్యం ఏమిటంటే.. ఈ మ్యాచ్ తర్వాత యువత రెజ్లింగ్ పట్ల ప్రేరణ పొందాలని అనుకుంటున్నాను. 40 ఏళ్ల వయసులోనూ నేను రెజ్లింగ్ ఆడగలిగితే యువత ఇంకా ఎన్నెన్ని చేయగలదో ఈ మ్యాచ్ ఆలోచింపజేస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నేను రెండు నుంచి మూడు కిలోల బరువు పెరిగాను. ఎందుకంటే.. ఇది కూడా ఒలింపిక్ తరహా రెజ్లింగే. ఒలింపిక్‌లో 3-3 నిమిషాల రెండు రౌండ్లు ఉంటాయి. అదే ఇక్క 3-3 నిమిషాల ఆరు రౌండ్లు ఉంటాయి.
ఏడేళ్ల తర్వాత మీరు మళ్లీ వస్తున్నారు. ఇప్పుడెందుకు మీరు మళ్లీ రింగ్‌లో దిగాలని అనుకున్నారు?
ముందు నేను దేశం తరఫున 96 కిలోల వెయిట్ కేటగిరీలో రెజ్లింగ్ మ్యాచ్ ఆడేవాడిని. ఆ తర్వాత నేను డబ్ల్యూడబ్ల్యూఈలోకి వెళ్లాను. ఆ తర్వాత ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఆడాను. ముందు స్పోర్ట్స్‌లో పైసలు ఉండేవి కావు. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే ఉద్యోగం దొరుకుతుందని అనుకునేవారు. అప్పుడు పతకాలు గెలవాలనే టార్గెట్ ఉండేది కాదు. ఇప్పడంటే పైసలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా రెజ్లింగ్ తీవ్ర చర్చలో ఉన్నది. కానీ, అవి మంచి కారణాలు కావు. నాకు గుర్తున్నంత వరకు 2008లో సుశీల్ తొలి పతకాన్ని గెలిచారు. అప్పుడు ఆయనను మాడ్రన్ రెజ్లింగ్‌కు నిదర్శనంగా చూశారు. అందులోనే నేను తొలి రెజ్లర్‌ను. ఆ తర్వాత రెజ్లింగ్ పై ప్రచారం ఎక్కువ జరిగింది. కానీ, ఇప్పుడు రెజ్లింగ్ చుట్టూ జరిగిన కొన్ని ఘటనలు ప్రజల్లో ఆందోళనలు కలిగించాయి. ప్రజలు తమ పిల్లలను రెజ్లింగ్‌లోకి పంపొద్దని అనుకునే స్థితి ఏర్పడింది. ఇది చాలా వివాదాస్పదమైన ఆట అని అనుకుంటున్నారు. కానీ, ఇది మంచి జెంటిల్‌మెన్ ఆట అని చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే కమ్ బ్యాక్ అయ్యాను.
యువతలో రెజ్లింగ్ అంటే ఒక నిర్వేదం ఏర్పడింది. ఈ మ్యాచ్ తర్వాత అది పోతుందా?
రెజ్లింగ్ ప్రపంచంలో నేను తిరిగి రావడానికి ప్రధాన లక్ష్యమే ఇది. నా మ్యాచ్‌లు చూసి యువత ఇన్‌స్పైర్ కావాలని ఆశిస్తున్నాను. నేు వరల్డ్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ హబ్‌లో ఉన్నాను. అప్పుడు కొందరిని 3, 4 మ్యాచ్‌లు భారత్‌లో ఆడి ఇక్కడికి రావాలని సూచించాను. ప్రతి వారానికి ఒక రెజ్లింగ్ మ్యాచ్ ఉండాలనేది నా విజన్. అది ఫైవ్ స్టారా? గల్లీలో ఆడుతున్నారా? అనేది అనవసరం. బయటి రెజ్లర్లతో ఇక్కడి యువతకు రెజ్లింగ్ ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటాను. దేశంలో కోట్లాది మంది యువత రెజ్లింగ్ చేస్తుంటారు. కానీ, మన దేశం నుంచి ఒక టీమ్ బయటికి వెళ్లినప్పుడు అందులో కేవలం ఏడుగురు, ఎనిమిది మంది మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కొందరు గ్రామాల్లో ఉంటారు.. వారు బయటివారితో రెజ్లింగ్ ఆడితే.. వారి పేరు కూడా సంపాదించుకుంటారు. అది కెరీర్‌గా కూడా మారుతుంది.
ముందు మీరు అంతర్జాతీయ రెజ్లర్. ఇప్పుడు నేరుగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి వచ్చారు. ఈ రెంటిలో అంతరం ఏమిటీ?
ఆది నుంచి నేను రెజ్లింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ప్రో లోకి వచ్చాను. ఇందులో కూడా ఒలింపిక్ తరహా నిబంధనలే ఉంటాయి. కాకపోతే.. ఇందులో స్టామినా, శక్తి ఎక్కువ అవసరం. ప్రో రెజ్లింగ్‌లో ఒలింపిక్‌లో కంటే ఎక్కువ రౌండ్లు ఉంటాయి. ఎక్కువ మంది చూడాలనే లక్ష్యంతోనే ఇందులో ఎక్కువ రౌండ్లు పెడతారు. నేను సోషల్ మీడియాలో ఉన్నాను. క్రికెటర్లు మినహా స్పోర్ట్స్‌లో ఎక్కువ మంది ఫాలో అయ్యేది నన్నే. మనం సోషల్ మీడియాను కూడా సరైన విధానంలో వాడుకోవాలి.
మన దేశంలో ప్రొఫెషనల్ రెజ్లింగ్ భవిష్యత్ ఏమిటీ? దీని ప్రమోషన్ ఎవరు చేస్తారు?
ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రారంభమైనప్పుడు ఇక బాక్సింగ్ పని అయినట్టే అని అందరూ అన్నారు. కానీ, ఆ తర్వాత ఒలింపిక్ వదిలి.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి కూడా చాలా మంది వచ్చారు. అసలు ఎందులోనైనా మనం సరైన విధంగా పని చేస్తే అవి కచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయి. మన లక్ష్యాలు, ఉద్దేశ్యాలు సరిగ్గా ఉండాలి అంతే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా రెజ్లర్లకు అండ లభిస్తున్నది. ఫిట్ ఇండియా ఉద్యమంతోనే మాకు ప్రభుత్వం నుంచి కొంత భరోసా ఉన్నది. ఇప్పుడు మ్యాచ్‌ను పెద్ద చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఎఫ్ఎం కూడా ఉన్నది. ఇంకా అనేక విధాలుగా ఈ మ్యాచ్‌లను ప్రమోట్ చేస్తున్నారు.
మీ వయసు 40 ఏళ్లు. అయినా.. మీరు ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? మీ డైలీ రోటీన్ ఏమిటీ?
నేను ప్యూర్ వెజిటేరియన్‌ను. నేను రెండే పనులు చేస్తాను. ఒకటి వర్క్ లేదా.. వర్కౌట్. నేను ఎక్సర్‌సైజ్ చేయని రోజు భోజనం చేయను. యోగా, ప్రాణాయమాలు కూడా చేస్తాను. మీరు రోజు వర్కౌట్ చేస్తూ సాధారణమైన భోజనం చేసినా ఫిట్‌గా ఉండగలరు. నేను అందరికీ ఇదే ఫిట్‌నెస్ మంత్రా చెబుతాను. ఆకలి కంటే కొంచెం తక్కువగా తినాలి. అంతకు మించి నీరు తాగాలి. దానికి మూడు రెట్లు వర్కౌట్ చేయాలి. నాలుగు రెట్లు నవ్వుతుండాలి. ఇలా మెయింటెయిన్ చేస్తే మీరు ఫిట్ అవుతారు. మనం ఎంత ప్రోటీన్, విటమిన్ తీసుకున్నా.. సంతోషంగా లేకుంటే ఫిట్‌గా ఉండలేం.