రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారంనాడు రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు.ఈ విషయమై పీటీఐ సంస్థ రిపోర్ట్ చేసింది.
సోనియా గాంధీతో పాటు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శర్మ ప్రకటించారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు. రాజస్థాన్ నుండి ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. దీంతో ఈ ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ మూడుతో ముగియనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ నుండి కిరోడిలాల్ మీనా డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేయడంతో మూడో స్థానం ఖాళీ అయింది.
రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 115 సీట్లున్నాయి. కాంగ్రెస్ కు 70 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి. రాజస్థాన్ నుండి పది రాజ్యసభ స్థానాలున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ కు ఆరుగురు , బీజేపీకి నలుగురు సభ్యులు రాజస్థాన్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు ఈ ఏడాది ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా పదవీ కాలం ఏప్రిల్ మాసంలో ముగియనుంది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 29వ తేదీన షెడ్యూల్ ను విడుదల చేసింది ఈసీ. ఈ నెల 8వ తేదీన ఎన్నిక సంఘం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మేరకు ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. అయితే ఖాళీ అవుతున్న స్థానాలకు సరిపోను అభ్యర్ధులు బరిలో ఉంటే వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ ఆరు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క స్థానం, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని మూడు స్థానాలను వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది.