
న్యూఢిల్లీ: జీ 20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల ఉమ్మడి వారసత్వ సంపదను వేడుక చేసుకోవడానికి కేంద్ర సాంస్కృతిక శాఖ కల్చర్ కారిడార్ - జీ 20 డిజిటల్ మ్యూజియం ఆలోచన చేసింది. ఇందుకు ఈ దేశాలన్నీ తమ ఆమోదం తెలిపాయి. ఈ డిజిటల్ మ్యూజియం భారత జీ 20 థీమ్ వసుధైవ కుటుంబకాన్ని ప్రతిబింబిస్తుంది. కల్చర్ వర్కింగ్ గ్రూప్ హాల్ మార్క్ క్యాంపెయిన్ సంస్కృతి మనందరినీ కలుపుతుందనే నినాదానికి అనుగుణంగా ఉంటుంది.
సెప్టెంబర్ 9న భరత మండపం వేదిక వద్ద ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది. కల్చర్ కారిడార్ జీ 20 డిజిటల్ మ్యూజియం వినూత్న ఆలోచన. ఇది వరకు ఇలాంటి మ్యూజియాన్ని జీ20 దేశాలు ఏర్పరచలేవు. సంఘటితం, ఐక్యత, విజ్ఞానాన్ని పంచుకోవడం, మనమంతా ఒకటే అనే గుర్తింపును అర్థం చేసుకునేలా ఈ మ్యూజియం ఉండనుంది. ఈ మ్యూజియంలో జీ 20 సభ్య దేశాలు, 9 ఆహ్వానిత దేశాల వారసత్వ సంపద, సాంస్కృతిక గుర్తింపులను పంచుకోవడానికి అంగీకరించాయి.
ఈ కల్చర్ కారిడార్ జీ 20 డిజిటల్ మ్యూజియంలో ఫిజికల్ వస్తువులు, డిజిటల్ మీడియా కూడా ప్రదర్శిస్తారు. ఐదు విభాగాల్లో వస్తువులను ఈ దేశాల నుంచి ఆహ్వానించారు. సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న వస్తువులను (ఫిజికల్ డిస్‌ప్లే), ఐకానిక్ కల్చరల్ మాస్టర్ పీస్ (డిజిటల్ డిస్‌ప్లే), ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, నేచురల్ హెరిటేజ్, ఆర్టిఫ్యాక్ట్ సంబంధ డెమోక్రటిక్ ప్రాక్టీస్‌కు సంబంధించిన గుర్తులు (ఫిజిటల్ లేదా డిజిటల్ అయినా) ఆహ్వానించారు. వీటిని ప్రదర్శనకు ఉంచుతారు.
Also Read: మాజీ ప్రధాని మనవడిపై అనర్హత వేటు.. కర్ణాటక కోర్టు తీర్పు
కల్చర్ కారిడార్ అనేది భావి మ్యూజియంలకు బీజం వంటివి. ఈ 29 దేశాల నైపుణ్యాలు, చిత్ర కళ, చరిత్ర ఇతర ముఖ్యమైన విషయలను పంచుకుని మనమంతా ఒకటే అనే అవగాహనను తీసుకురావడానికి వీలవుతుంది.