
Mallikarjun Kharge: విపక్షాల కూటమి బలం చూసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోందని, భారత కూటమి భాగస్వాములు తమపై ఏజెన్సీలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున ప్రతీకార రాజకీయాలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం నాడు జరిగిన విపక్షాల సమావేశంలో ప్రసంగిస్తూ.. గత తొమ్మిదేళ్లుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేసిన మతపరమైన విషాన్ని వ్యాప్తి చేశాయనీ, అమాయక పాఠశాల విద్యార్థుల్లో విద్వేషపూరిత అంశాలను నూరిపోస్తున్నారని ఆరోపించారు. హోమ్‌వర్క్ పూర్తి చేయనందుకు ఓ ముస్లిం క్లాస్‌మేట్‌ను చెప్పుతో కొట్టమని ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఆదేశించిన ఘటన, ముజఫర్‌నగర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన సంఘటనల గురించి ఆయన ప్రస్తవిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ః
ఖర్గే మాట్లాడుతూ.. పాట్నా, బెంగళూరులో జరిగిన రెండు సమావేశాల విజయాన్ని ప్రధానమంత్రి, తన తదుపరి ప్రసంగాలలో భారతదేశంపై దాడి చేయడమే కాకుండా మన ప్రియమైన దేశం పేరును కూడా పోల్చడం ద్వారా కొలవవచ్చనీ, ఒక తీవ్రవాద సంస్థతో,బానిసత్వానికి చిహ్నంతో సూచించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాల కారణంగా రానున్న నెలల్లో మరిన్ని దాడులకు, జరగబోయే అరెస్టులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇండియా కూటమి ఎంత పుంజుకుంటే.. బీజేపీ ప్రభుత్వం.. విపక్ష నేతలపై ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఫైర్
సెప్టెంబర్ 18 నుండి 22 వరకు "పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు" నిర్వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలుపునివ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు.మణిపూర్ మండుతున్నప్పుడు.. దేశం నియంతృత్వం వైపు వెళుతున్న వేళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించలేదని కేంద్రాన్ని నిలదీశారు. కానీ.. బీజేపీ తన స్వప్రయోజనాల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందనీ, ప్రతిపక్షంలో ఎవరినీ అడగకుండా.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచారని మండిపడ్డారు. COVID-19 మహమ్మారి సమయంలో .. చైనా సమస్యపై లేదా నోట్ల రద్దు వంటి కీలక అంశాలపై కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించలేదని ఆరోపించారు.
అసలూ ఎజెండా ఏమిటో తెలియజేయకుండా.. ఇష్టానూసారంగా సమావేశాలు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలే నియంతృత్వం వైపు తీసుకెళ్లాయనిఅన్నారాయన. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఎజెండాను మాత్రం వెల్లడించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పేదల కోసం ఎప్పటికీ పనిచేయరని, నిరుద్యోగం, పెరుగుతున్న ఇంధన ధరలు, ఇతర ప్రజా సంక్షేమ సమస్యలపై పోరాడడమే భారత కూటమి లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.