
భారతదేశం తన మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని ఆగస్టు 20, 2025 అంటే ఇవాళ(బుధవారం) టెస్ట్ చేసింది. ఒడిశా రాష్ట్రం చండిపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సక్సెస్‌ఫుల్‌గా టెస్టింగ్ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం… ఈ పరీక్షలో అన్ని ఆపరేషనల్, టెక్నికల్ విషయాలను సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై చేయబడ్డాయి.స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగింది.
అగ్ని-5 భారతదేశ మొట్టమొదటి సర్ఫేస్-టు-సర్ఫేస్ ఖండాంతర క్షిపణి, ఇది 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను కలిగి ఉంది. ఈ మిస్సైల్ పాకిస్థాన్, చైనా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేయగలదు. ఈ క్షిపణి అడ్వాన్స్‌డ్ MIRV టెక్నాలజీని ఉపయోగించి ఒకేసారి చాలా టార్గెట్లపై దాడులు చేయగలదు. దాదాపు 1.5 టన్నుల అణు ఆయుధాలను మోసుకెళ్లగల ఈ క్షిపణి వేగం ధ్వని కంటే 24 రెట్లు ఎక్కువ, ఇది మ్యాక్ 24 వేగాన్ని చేరుకుంటుంది.
క్యానిస్టర్ ఆధారిత లాంచర్ సిస్టమ్ కారణంగా దీన్ని ఎక్కడికైనా సులభంగా రవాణా చేయవచ్చు. ప్రపంచంలో కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే ఖండాంతర క్షిపణులను కలిగి ఉన్నాయి… ఈ సక్సెస్‌ఫుల్ టెస్ట్‌తో భారతదేశం ఈ జాబితాలో చేరింది. MIRV టెక్నాలజీ కారణంగా ఒకే క్షిపణి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బహుళ లక్ష్యాలను టార్గెట్ చేయగలదు లేదా ఒకే లక్ష్యంపై బహుళ వార్‌హెడ్‌లను ప్రయోగించగలదు. ఈ విజయం భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది, ప్రపంచ రక్షణ రంగంలో భారత్ స్థానాన్ని పటిష్టం చేసింది.